
palm oil crisis: భారత్ వంటింట్లో మళ్లీ మంటలు..!
ఇండోనేషియాలో పామాయిల్ సంక్షోభం
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
ఇండోనేషియాలో వంట నూనె కోసం క్యూలో నిలబడి మార్చిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వాస్తవానికి ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ పండించేది ఇండోనేషియానే కావడం విశేషం..! అలాంటి ఇండోనేషియాలో దేశీయంగా పామాయిల్ డిమాండ్ భారీగా పెరిగింది. గత నెలలో ప్రభుత్వం పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. మరోపక్క రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా ఈ పరిస్థితికి ఆజ్యం పోసింది.
ఇండోనేషియాలో డిసెంబర్లో 3.98 మిలియన్ టన్నుల పామాయిల్ దిగుబడి లభించింది. అదే జనవరికి వచ్చేసరికి అది 3.86 మిలియన్ టన్నులకే పరిమితమైంది. దీనికి తోడు వంట నూనెలు ఎక్కువగా ఉత్పత్తి చేసే ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కారణంగా పొద్దు తిరుగుడు నూనె మార్కెట్లకు అందడంలేదు. 2021 మార్చి నుంచి 2022 మార్చిలోపు ఇండోనేషియాలో వంటనూనెల ధర 14,000 ఐడీఆర్ (ఇండోనేషియన్ రూపయ) నుంచి 22,000 ఐడీఆర్కు పెరిగింది. దీంతో ఫిబ్రవరిలో ప్రభుత్వం రంగంలోకి దిగి చిల్లర విక్రయ ధరపై సీలింగ్ విధించింది. వంట నూనెల ధరల తగ్గించినా.. సూపర్ మార్కెట్లలో మాత్రం అవి అందుబాటులో లేవు. అదే సమయంలో అక్కడి ప్రభుత్వం ఎగుమతులకు సిద్ధం చేసుకొన్న పామాయిల్లో 20శాతం దేశీయ మార్కెట్లలో విక్రయించాలని ఆదేశించింది. వీటిలో ముడి పామాయిల్ కేజీకి 9,300 ఐడీఆర్, ప్రాసెస్ చేసిన పామాయిల్ కిలోకు 10,300గా ధర నిర్ణయించింది. మార్చి10న మరోసారి తన ఆదేశాలను సవరించి 30శాతం దేశీయంగానే విక్రయించాలనే నిబంధన అమల్లోకి తెచ్చింది. కానీ, మార్చి 16-17 తేదీల్లో ఈ నిబంధనలు మొత్తం తొలగించి ఎగుమతులపై కొత్త పన్ను విధించడం మొదలుపెట్టింది. టన్ను 1,000 డాలర్ల నుంచి 1050 డాలర్ల ధర మధ్యలో విక్రయించే ముడి పామాయిల్‌పై 175 డాలర్లు.. టన్ను 1,500 డాలర్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించే రకాలపై 175 డాలర్లు పన్నును నిర్ణయించింది.
వంటనూనె ఉత్పత్తి దేశాల్లో సమస్యలు..
* కరోనా సమయంలో మలేషియాలో పామాయిల్ తోటల్లో పనిచేసే కూలీలు కరవయ్యారు. ఈ ప్రభావం పామాయిల్ దిగుబడిపై పడింది.
* సోయాబీన్ నూనెను ఎక్కువగా ఉత్పత్తి చేసే దక్షిణ అమెరికా దేశాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వేల్లో ఉత్పత్తి 9.4శాతం పడిపోవచ్చని అంచనా.
* రష్యా ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో నల్లసముద్రంలో ఎగమతి మార్గాలు మూసుకుపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వంటనూనె కరవు ఏర్పడింది.
ఆజ్యం పోసిన ఇండోనేషియా ప్రభుత్వం..
ఇండోనేషియా ప్రభుత్వం పామాయిల్‌ను బయోడీజిల్‌గా వాడాలని 2020లో నిర్ణయించింది. దీని ప్రకారం 30శాతం పామాయిల్‌ను కలిపిన డీజిల్‌ను విక్రయిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో ఇండోనేషియాలో వినియోగించే 17.1 మిలియన్ టన్నుల్లో.. 7.5మిలియన్ టన్నులు బయో డీజిల్‌కే వెచ్చించాల్సి వస్తోంది. బయోడీజిల్ నిర్ణయం కారణంగా భారీ ఎత్తున పామాయిల్ అటువైపు మళ్లుతోంది. ఫలితంగా ఎగుమతులు తగ్గుతున్నాయి.
భారత్‌పై ప్రభావం..
భారత్ ప్రపంచంలో అత్యధికంగా వంట నూనెలు దిగుమతి చేసుకొంటున్న దేశం. మన వార్షిక దిగుమతులు 14 మిలియన్ టన్నుల వరకు ఉంటాయి. వీటిల్లో పామాయిల్ 8 నుంచి 9 మిలియన్ టన్నులు, 3.5 మిలియన్ టన్నులు, పొద్దు తిరుగుడు నూనె 2.5 మిలియన్ టన్నులు ఉంటున్నాయి. భారత్‌కు అత్యధికంగా పామాయిల్ సరఫరా చేసే దేశం ఇండోనేషియానే. కానీ, ఎగుమతులపై ఆంక్షలు, పన్నులు, అక్కడి ప్రజల అవసరాలు, బయోడీజిల్ ప్రోగ్రామ్ కారణంగా ప్రపంచ దేశాల అవసరాలకు సరిపడా పామాయిల్ లభించడంలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
-
Politics News
Maharashtra crisis: సుప్రీంకు చేరిన ‘మహా’ పంచాయితీ.. పిటిషన్ దాఖలు చేసిన రెబల్స్
-
India News
PM modi: భారత ప్రజాస్వామ్యంపై ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. ఎన్నారైల సమావేశంలో మోదీ
-
Business News
GST: క్యాసినో, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేలపై 28శాతం జీఎస్టీ!
-
India News
Maharashtra Crisis: ఏక్నాథ్ గూటికి మరో మంత్రి.. అస్సాం క్యాంపులో 9కి చేరిన మంత్రులు
-
General News
TS Corona: తెలంగాణలో కొత్తగా 434 కరోనా కేసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- R Madhavan: మాధవన్‌పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్‌గా ఉండు..!
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు