Environment: సమతుల్య వాతావరణానికి ముమ్మర చర్యలు

పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మానవాళి మనుగడకు ముప్పని సంకేతాలు చూపిస్తోన్న నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం కించెత్తు కూడా కనడటం లేదు. ప్రపంచ దేశాలు వాతావరణ సమస్యలపై కాప్‌ 26 పేరిట వేదికలు ఏర్పాటు చేసుకుని ఒప్పందాలు కుదుర్చుకున్నా కార్యచరణ మాత్రం శూన్యం. అందుకు నిదర్శనమే

Published : 12 Apr 2022 19:26 IST

దిల్లీ: పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రపంచ దేశాలు వాతావరణ సమస్యలపై కాప్‌ 26 పేరిట వేదికలు ఏర్పాటు చేసుకుని ఒప్పందాలు కుదుర్చుకున్నా కార్యాచరణ శూన్యం. అందుకు నిదర్శనమే ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌(ఐపీసీసీ) నివేదికలు. వాతావరణ సమతుల్యతను కాపాడటానికి చర్యలు మరింత ముమ్మరం చేయాలంటూ ఐపీసీసీ తాజాగా నివేదికలు విడుదల చేసింది.

* 2010 నుంచి 19 లోపు గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల శాతం గరిష్ట స్థాయిలో పెరిగింది.

* 2025 కల్లా ఈ ఉపరితలంలో పేరుకునే ఉద్గారాలు ఎక్కువవుతాయి. కానీ, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల కారణంగా 2030కి ఇవి 43 శాతం తగ్గే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

* 2030 తరువాత మాత్రమే ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువకు తీసుకురావడానికి వీలవుతుంది. 1.5 డిగ్రీల సెల్సియస్‌ మానవాళి మనుగడకు అనువైన ఉష్ణోగ్రత. అది దాటితే సమతుల్య స్థితికి చేరుకోవడం కష్టమైనది. ఖరీదైనది.

* ప్రజా రవాణాలోని విద్యుదీకరణ వంటి ఉపశమన చర్యలు చేపడితే డీ-కార్బనైజేషన్‌ సాధ్యమవుతుంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డిజిటల్‌ టెక్నాలజీని అదుపులోకి తేవడం ద్వారా దీన్ని సాధించవచ్చు.

మానవ చరిత్రలో 2010 - 2019లో సగటు ఉద్గారాల సంఖ్యలో అత్యధిక పెరుగుదల కనిపించిందని నివేదిక సూచించింది. దీని కారణంగానే నీటి ఎద్దడి ఎక్కువైందని పేర్కొంది. గడిచిన వందేళ్లలో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు 0.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నట్లు నివేదిక వివరించింది. మరోవైపు 19వ శతాబ్దంతో పోలిస్తే  సముద్ర మట్టం 19 సెంటీమీటర్లు పెరిగినట్లు సమాచారం. ఇది మరింత పెరిగితే సముద్ర తీరప్రాంతాలు మునిగిపోవటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని