Iran: మేం ఆమెను చంపలేదు.. చనిపోయింది..!

హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై ఇరాన్‌లో మాసా అమీని అనే యువతిని అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆమె.. చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 16న మరణించారు.

Published : 25 Nov 2022 01:38 IST

దిల్లీ: హిజాబ్‌ సరిగా ధరించలేదన్న అభియోగంపై ఇరాన్‌లో పోలీసు కస్టడీలో మాసా అమీని అనే యువతి మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై ఆ దేశ విదేశాంగ సహాయ మంత్రి స్పందించారు. మేం ఆమెను ‘చంపలేదు..మరణించింది’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న ఆయన తమ దేశంలో జరుగుతోన్న నిరసనల్లో పాశ్చాత్య దేశాల పాత్రను విమర్శించారు. 

హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై ఇరాన్‌లో మాసా అమీని అనే యువతిని అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆమె.. చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 16న మరణించారు. దీంతో ఆమె సొంత ప్రావిన్సు కుర్దిస్థాన్‌లో సెప్టెంబర్‌ 17న మొదలైన నిరసనలు.. ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలో తన వ్యాఖ్యలతో ఇరాన్ మంత్రి  అలీ బఖేరి పోలీసుల చర్యను సమర్థించారు. ‘మాసాను చంపలేదు. ఆమె మరణించింది. ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితిని ఆసరాగా చేసుకొని పాశ్యాత్య మీడియా వ్యవహరించిన తీరును చూశాం. వారి ఆరోపణలు నిరాధారమైనవి’ అని అన్నారు. 

ఇదిలా ఉంటే..ఇరాన్‌లో చెలరేగుతోన్న నిరసనలను అక్కడి భద్రతా బలగాలు కర్కశంగా అణచివేస్తున్నాయి. దాంతో వారం వ్యవధిలో 72 మరణించారని, అందులో 56 మంది కుర్దిష్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల వారని ఓ కథనం పేర్కొంది. కాగా అణచివేతను అంతర్జాతీయ సమాజం ఖండిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని