ISIS: ఐసిస్ చీఫ్ అబూ అల్ హసన్ ఖురేషీ హతం!
ఇస్టామిక్ స్టేట్ (ఐసిస్) గ్రూప్ చీఫ్ అబూ అల్-హసన్ అల్-హషిమీ అల్-ఖురేషీ మృతిచెందినట్టు ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేసింది.
దిల్లీ: ఇస్టామిక్ స్టేట్ (ఐసిస్) గ్రూప్ చీఫ్ అబూ అల్-హసన్ అల్-హషిమీ అల్-ఖురేషీ హతమయ్యాడు. తమ నాయకుడు మృతిచెందినట్టు ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేసింది. అందులో అబు అల్-హసన్ స్థానంలో ఐఎస్ కొత్త చీఫ్‌గా అబూ అల్-హుస్సేన్ అల్-హుస్సేని అల్-ఖురేషీని నియమించినట్లు వెల్లడించింది. ఈ ఆడియో సందేశంలో మాట్లాడిన వ్యక్తి ఉగ్రవాద గ్రూప్ కొత్త చీఫ్ అబూ అల్-హుస్సేన్ అని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ సందేశంలో అబూ అల్-హసన్ ఇరాక్‌లో శత్రువులతో జరిగిన యుద్ధంలో చనిపోయినట్లు పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు మరణించాడనే వివరాలను మాత్రం బయటపెట్టలేదు.
అబూ అల్-హసన్‌కి ముందు ఐసిస్ చీఫ్‌గా వ్యవహరించిన అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీ ఫిబ్రవరిలో ఉత్తర సిరియా ప్రాంతంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో తనను తాను పేల్చేసుకున్నాడు. అంతకముందు అమెరికా కమాండోల దాడిలో ఇస్లామిక్ స్టేట్ కీలక నేత అబూ బకర్ అల్-బగ్దాది హతమయ్యాక 2019 అక్టోబరు 31న అతడి స్థానంలోకి ఖురేషీ వచ్చాడు. తాజాగా అబూ అల్-హసన్ మృతిచెందినట్టు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!