Vivek Ramaswamy: వివేక్ పిల్లల.. ‘కేర్ టేకర్’ జీతం రూ.80లక్షలు..?
వివేక్ రామస్వామి పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసే ‘నానీ’కి రూ.80లక్షల జీతం ఆఫర్ చేసినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడి అభ్యర్థిత్వం రేసులో కొనసాగుతోన్న వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) నుంచి ఓ బంపర్ ఆఫర్ వెలువడింది. తన పిల్లల సంరక్షణ చూసుకునేందుకు ‘నానీ’ (Nanny) ని నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం సంరక్షకురాలికి జీతం ఏడాదికి లక్ష డాలర్లు (సుమారు రూ.80లక్షలు) ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓ జాబ్ పోర్టల్‌లో ప్రకటన వెలువడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
‘వారంలో 84 నుంచి 96 గంటలు పనిచేయాలి. తదుపరి వారం మొత్తం సెలవు ఉంటుంది. ఇంట్లోని చెఫ్, ఇతర నానీలు, హౌస్‌కీపర్, ప్రైవేటు సెక్యూరిటీ వంటి తదితర సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి. చిన్నారులకు క్యూరేటర్లుగా వ్యవహరిస్తూ వారిని ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి’ అని ఎస్టేట్ జాబ్స్.కామ్ అనే పోర్టల్‌లో ప్రకటన వచ్చింది. అయితే, క్లైంట్ ఎవరనే విషయాన్ని అందులో పేర్కొనక పోయినప్పటికీ.. మీడియా సంస్థలు మాత్రం అది రామస్వామి కుటుంబం ప్రకటనే అని స్పష్టీకరిస్తున్నాయి. కాగా వివేక్ రామస్వామి.. భారత సంతతికి చెందిన అపూర్వను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు.
H-1B visa: నేనొస్తే.. ‘లాటరీ’ విధానానికి స్వస్తి..! వివేక్ రామస్వామి
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వివేక్ రామస్వామి పోటీ పడుతున్నారు. ఇటీవల జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలతో వివేక్ రామస్వామి అనేక మంది దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు, వివేక్ రామస్వామి ట్రంప్ వారసుడంటూ ఒకానొక సమయంలో టైమ్ మ్యాగజైన్ కూడా సంబోధించిన విషయం తెలిసిందే. ఏదేమైనా.. భారత సంతతికి చెందిన ఈ బిలియనీర్ ఇంట్లో పనిచేయడమంటే కేర్‌టేకర్లకు గొప్ప విషయమే కదా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.