Israel: దక్షిణ గాజాలో పగటి పూట కాల్పుల విరామం

గాజాపై గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించింది.

Updated : 17 Jun 2024 06:35 IST

మానవతా సాయం తరలింపు కోసమే
ప్రకటించిన ఇజ్రాయెల్‌ సైన్యం

జెరూసలెం: గాజాపై గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించింది. పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేందుకు వీలుగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఏడు గంటలవరకు కాల్పులకు విరామం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) తెలిపింది. రఫా ప్రాంతంలోని 12 కిలోమీటర్ల మేర రహదారి వెంబడి ఈ వ్యూహాత్మక విరామం కొనసాగనుంది. దీంతో గత కొన్ని వారాలుగా మానవతా సాయం అందక, అల్లాడుతున్న పాలస్తీనియన్లను ఊరట లభించనుంది. తదుపరి నోటీసు ఇచ్చేవరకు ఈ విరామం కొనసాగుతుందని ఐడీఎఫ్‌ పేర్కొంది. దీంతో కెరోమ్‌ షాలోమ్‌ క్రాసింగ్‌ దగ్గర మానవతా సాయంతో వేచి ఉన్న ట్రక్కులు సురక్షితంగా సలాహ్‌-అల్‌-దిన్‌ రహదారి నుంచి ప్రయాణించగలవు. దీంతో రఫా ప్రాంతానికే కాకుండా.. ఖాన్‌ యూనిస్‌.. ఉత్తర గాజాలోని ప్రాంతాలకు మానవతాసాయం అందే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిర్ణయం ఇజ్రాయెల్‌లో ప్రకంపనలు రేపుతోంది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వంపై ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. మానవతా సాయం అందివ్వడానికి యుద్ధానికి విరామం ఇవ్వడమేంటని సంకీర్ణ ప్రభుత్వంలోని అతి మితవాద నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు