Modi-Meloni Selfie: మళ్లీ ‘మెలోడీ’ మూమెంట్‌.. మోదీ, మెలోనీ మరో సెల్ఫీ వైరల్‌

Modi-Meloni Selfie: జీ7 సదస్సులో మరోసారి ‘మెలోడీ’ మూమెంట్‌ కన్పించింది. భారత్‌, ఇటలీ ప్రధానులు మోదీ, మెలోనీ మరోసారి సెల్ఫీ దిగారు.

Updated : 15 Jun 2024 12:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ మధ్య భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సెల్ఫీ దిగారు. ‘మెలోడీ (#Melodi)’ పేరుతో ఆ ఫొటో అప్పట్లో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. తాజాగా మరోసారి వీరిద్దరూ స్వీయ చిత్రం తీసుకున్నారు. దీంతో ఈ ‘మెలోడీ’ మూమెంట్‌ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది. (Modi-Meloni Selfie)

ఇటలీ (Italy)లోని అపులియా వేదికగా జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రధాని మోదీ (PM Modi)కి ఇటలీ ప్రధాని మెలోనీ ‘నమస్తే’ అంటూ సాదర స్వాగతం పలికారు. కొద్ది సేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోనీ (Giorgia Meloni) సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పాటు ఈ సెల్ఫీ వీడియోను మెలోనీ తన 
‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ‘హాయ్‌ ఫ్రెండ్స్‌, ఫ్రమ్‌ మెలోడీ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

సాంకేతికతలపై గుత్తాధిపత్యం వద్దు: జీ7 అనుబంధ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన

గతేడాది డిసెంబరులో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ వేదికగా జరిగిన ‘కాప్‌28’ సదస్సు సందర్భంగా వీరిద్దరి సెల్ఫీ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. మోదీతో తీసుకున్న స్వీయ చిత్రాన్ని మెలోనీ ఎక్స్‌లో షేర్‌ చేశారు. దానికి మెలోడీ (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. అప్పటి నుంచి ఈ #Melodi పదం ట్రెండ్‌ అయ్యింది. కాగా.. నాటి ఫొటోపై ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ.. ‘‘స్నేహితుల్ని కలుసుకోవడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది’’ అని బదులిచ్చారు.

ఇక, జీ7 సదస్సు (G7 Summit)లో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం వరుస ద్వైపాక్షిక భేటీలతో బిజీబిజీగా గడిపారు. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్‌ సహా పలు దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. వరుసగా మూడో దఫా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మోదీకి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని