Japan: జపాన్‌ను తాకిన విద్యుత్తు కోతల సెగ..!

టోక్యో, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని జపాన్‌ ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్తు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం

Published : 27 Jun 2022 21:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని జపాన్‌ ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్తు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజలు మూడు గంటల పాటు అనవసరమైన లైట్లను ఆఫ్‌ చేయాలని కోరింది. పెరిగిన ఉష్ణోగ్రతలను తప్పించుకోవడానికి ఎయిర్‌ కండీషనర్లను వినియోగించుకోవచ్చని పేర్కొంది. 

ప్రస్తుతం సెంట్రల్‌ టోక్యోలో 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ను ఇది దాటేస్తోంది. జపాన్‌ జాతీయవార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రకారం పెరుగుతున్న వేడి కారణంగా 46 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఉక్కపోత నేపథ్యంలో విద్యుత్తు వినియోగం పెరిగింది. సోమవారం టోక్యోలో అవసరమైన దాని కంటే 3.7శాతం తక్కువ విద్యత్తు ఉత్పత్తి అవుతోంది. మధ్యాహ్నం మూడు గంటలపాటు అనవసరమైన దీపాలను ఆపివేయాలని సూచించారు. 

విద్యుత్తు కొరత దేనికి..?

జపాన్‌లో ఈశాన్య ప్రాంతంలో ఈ ఏడాది మార్చిలో భూకంపం వచ్చింది.  దీంతో చాలా అణువిద్యుత్తు కేంద్రాలను మూసివేశారు. ఉద్గారాలను తగ్గించడానికి శిలాజ ఇంధనం ఆధారంగా నడిచే చాలా కర్మాగారాలను ఇప్పటికే అధికారులు మూసివేయించారు. అదే సమయంలో డిమాండ్‌ పెరగడంతో  కొరత తీవ్రమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని