Published : 26 May 2022 01:24 IST

Japan: ₹12లక్షలు ఖర్చుచేసి.. శునకంలా మారిపోయిన జపాన్‌ వాసి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పూర్తిగా జంతువులా కనిపించాలనుకున్న తన జీవిత కలను సాకారం చేసుకున్నాడు ఓ జపాన్‌ వాసి. అచ్చూ ‘కోలీ’ జాతి శునకంలా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పంచుకోగా.. వాటిని చూసిన నెటిజన్లు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. పూర్తి శునకంలా కనిపించేందుకు ఓ వ్యక్తి భారీగా ఖర్చు చేయగా, నిపుణులు 40 రోజులపాటు కష్టపడ్డారు.

జపాన్‌కు చెందిన న్యూస్‌.మైనవి వార్తా ఏజెన్సీ ప్రకారం.. జెప్పెట్ అనే ఓ సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం పెద్ద ఎత్తును శిల్పాలను తయారు చేస్తుంది. అద్భుత కళాఖండాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రసిద్ధ మస్కట్ పాత్రల దుస్తులను కూడా రూపొందిస్తోంది. కాగా టోకో ఇవీ అనే వ్యక్తి.. తాను పూర్తిగా శునకంలా కనిపించాలనే కోరికను జెప్పెట్‌ ముందుంచాడు. ఎంత ఖర్చునైనా భరిస్తానని చెప్పడంతో ఇందుకు ఆ సంస్థ అంగీకరించింది.

సంస్థ కళాకారులు 40 రోజులపాట కష్టపడి టోకో ఇవీని కోలీ జాతి శునకంలా మార్చారు. మేకప్‌, ఇతరత్రా ఖర్చుల కోసం ఇవీకి 2 మిలియన్‌ యెన్‌లు (దాదాపు రూ.12 లక్షలు) ఖర్చయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో, ఓ వీడియోను తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పంచుకున్నాడు టోకో ఇవీ. అయితే ఎన్నిరోజులపాటు ఇలా ఉంటాననే విషయం మాత్రం అతడు చెప్పలేదు.



Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని