Ukraine Crisis: ఉక్రెయిన్‌ సరిహద్దులకు అమెరికా ప్రథమ మహిళ..!

యుద్ధంతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్‌ సరిహద్దు దేశానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సతీమణ త్వరలో ప్రయాణం కానున్నారు. ఉక్రెయిన్‌ నుంచి తలదాచుకోవడానికి ఆదేశానికి వచ్చిన తల్లులను మదర్స్‌డే సందర్భంగా ఆమె కలవనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. 

Updated : 03 May 2022 16:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా దండయాత్రతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్‌ సరిహద్దు దేశానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సతీమణి త్వరలో రానున్నారు. ఉక్రెయిన్‌ నుంచి తలదాచుకోవడానికి ఆ దేశానికి వచ్చిన తల్లులను మదర్స్‌డే సందర్భంగా ఆమె కలవనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. 

జిల్‌ తన పర్యటనలో భాగంగా గురువారం అమెరికా నుంచి రొమానియాలోని మిహైల్‌ కొగల్నిసియా ఎయిర్‌ బేస్‌కు చేరుకొంటారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌ బేస్‌ నాటో ప్రతిస్పందన దళాలకు స్థావరంగా ఉంది. అక్కడ సర్వీస్‌ మెంబర్లను ఆమె కలవనున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం సిబ్బంది వెల్లడించారు.గురువారం నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో ఆమె పలువురు దేశనాయకులతో బేటీ కానున్నారు. దీంతోపాటు మదర్స్‌ డే రోజున ఆమె స్లొవాకియాలో ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన తల్లులతో భేటీ కానున్నారు. యుద్ధం మొదలైన నాటినుంచి 55లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడి వివిధ ప్రాంతాలకు వలసపోయారు.  

ఇప్పటికే జిల్‌ బైడెన్‌ ఉక్రెయిన్‌కు మద్దతుగా సన్‌ఫ్లవర్‌ ఉన్న మాస్కును ధరించి  సంఘీభావం తెలిపింది. అదే నెలలో ఆమె ఉక్రెయిన్‌కు సంక్షోభంలో సాయం చేయడానికి పంపిన అమెరికా సైనికుల కుటుంబాలను కలుసుకొన్నారు. సైనికుల తల్లుల మనస్సు తనకు తెలుసని ఆమె అనునయించారు.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కూడా త్వరలోనే కీవ్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా హౌస్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఆడమ్‌ స్కిఫ్‌ ఇటీవల వెల్లడించారు. జోబైడెన్‌ పర్యటన విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు. ఎంత తొందరగా ఈ పర్యటన సాధ్యమవుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అమెరికా రక్షణ,విదేశాంగ మంత్రులతోపాటు ప్రతినిధుల సభ స్పీకర్‌, కీలక కమిటీల అధ్యక్షులు కీవ్‌లో పర్యటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని