Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గృహ నిర్బంధం?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌(Xi Jinping)ను గృహ నిర్బంధం(House Arrest) చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతోపాటు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(PLA) చీఫ్‌ పదవి నుంచీ ఆయన్ను...

Published : 24 Sep 2022 22:18 IST

నెట్టింట చక్కర్లు కొడుతోన్న వార్తలు

ఇంటర్నెట్‌ డెస్క్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌(Xi Jinping)ను గృహ నిర్బంధం(House Arrest) చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతోపాటు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(PLA) చీఫ్‌ పదవి నుంచీ ఆయన్ను తొలగించినట్లు ఊహాగానాలు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. భాజపా నేత సుబ్రమణ్యస్వామి సైతం ఈ విషయంపై శనివారం ట్వీట్‌ చేశారు. అయితే, ఈ వ్యవహారంపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ(CCP) నుంచి లేదా ప్రభుత్వ మీడియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

‘జిన్‌పింగ్ బీజింగ్‌లో గృహ నిర్బంధంలో ఉన్నారా? ఇటీవల సమర్కండ్‌ సదస్సులో ఉన్న సమయంలో.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన్ను ఆర్మీ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగించారని, ఆపై హౌస్ అరెస్ట్ చేశారని రూమర్స్‌ వస్తున్నాయి. అయితే, వాస్తవాలను ధ్రువీకరించాల్సి ఉంది' అని సుబ్రమణ్యస్వామి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు.. చైనీయులు సైతం జిన్‌పింగ్ గృహ నిర్బంధంపై ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు. బీజింగ్‌ నగరం ఆర్మీ నియంత్రణలో ఉందని పేర్కొంటున్నారు. సైనిక వాహనాలు రాజధాని బాట పట్టాయని చెబుతున్నారు.

ఎందుకీ ఊహాగానాలు?

అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా చైనాలో ఇటీవల ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష, నలుగురు అధికారులకు జీవిత ఖైదు పడింది. అయితే, పలు కథనాలు.. ఈ ఆరుగురిని జిన్‌పింగ్‌కు రాజకీయ ప్రత్యర్థులుగా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే జిన్‌పింగ్‌పై సీనియర్లు తిరుగుబాటు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, జిన్‌పింగ్ గృహ నిర్బంధం అనే వార్తలను ఆయన ప్రత్యర్థి వర్గమే సృష్టించినట్లు వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కొవిడ్‌ పరిస్థితులతో చైనా బయటకు అడుగుపెట్టని జిన్‌పింగ్‌.. ఇటీవల కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లలో పర్యటించిన విషయం తెలిసిందే. సమర్కండ్‌లో నిర్వహించిన షాంఘై సహకార సంస్థ సదస్సు(ఎస్‌సీఓ)లోనూ పాల్గొన్నారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని