White House : శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు
శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడు జోబైడెన్ , ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మాట్లాడారు. బైడెన్ కార్యవర్గంలోని ఇండో-అమెరికన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైన శ్వేత సౌధం చరిత్రలోనే భారీస్థాయిలో దీపావళి వేడుకలను సోమవారం నిర్వహించారు. బైడెన్ కార్యవర్గంలోని ఇండో-అమెరికన్లు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ..‘‘మీకు ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను. శ్వేత సౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు చాలా మది ఆసియా-అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెరికా చరిత్రలోనే తొలి ఆఫ్రికా, దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్ నేతృత్వంలోని నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మాట్లాడుతూ ‘‘శ్వేత సౌధం ఒక ప్రజాసౌధం. ఇక్కడ అన్ని జాతుల వారు.. అధ్యక్షుడు, తొలి మహిళతో కలిసి వారి పండుగలను నిర్వహించుకోవచ్చు. 100 కోట్ల మంది ప్రజలతో కలిసి బైడెన్ కార్యవర్గం కూడా దీపం వెలిగించి చెడుపై మంచి, అజ్ఞానంపై విజ్ఞానం, చీకటిపై వెలుతురు జరిపే పోరాటంలో భాగమైంది’’ అని పేర్కొన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా శ్వేతసౌధంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Congress: ‘భద్రతా సిబ్బంది మాయం..’ రాహుల్ పాదయాత్ర నిలిపివేత!
-
World News
Raja Chari: మన రాజాచారి మరో ఘనత.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో కీలక పదవి..!
-
General News
Pariksha Pe Charcha: మోదీకి తెలంగాణ విద్యార్థిని ప్రశ్న.. నివృత్తి చేసిన ప్రధాని
-
Sports News
Sourav Ganguly : కోహ్లీ.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడు : గంగూలీ
-
Movies News
RGV: షారుఖ్ పని అయిపోయిందన్నారు.. ‘పఠాన్’ బదులిచ్చింది
-
General News
Supeme Court: అహోబిలం మఠం కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ