Elon Musk: ‘బైడెన్ చేసిన తప్పు ఏంటంటే..’ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
ప్రజలంతా తక్కువ డ్రామా కోరుకున్నందునే జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యారంటూ ప్రముఖ బిలీనియర్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బైడెన్ చేసిన తప్పు ఏంటంటే.. దేశాన్ని మార్చడానికే అధ్యక్షుడిగా...
ఇంటర్నెట్ డెస్క్: ప్రజలంతా తక్కువ డ్రామా కోరుకున్నందునే జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యారంటూ ప్రముఖ బిలీనియర్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బైడెన్ చేసిన తప్పు ఏంటంటే.. దేశాన్ని మార్చడానికే తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని భావించడం. కానీ.. నిజానికి అందరూ తక్కువ నాటకీయతను కోరుకున్నారు’ అని శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. అధ్యక్ష రేసులో బైడెన్ చేతిలో ఓడిపోయిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విటర్లో విధించిన నిషేధాన్ని ఎత్తేస్తానని ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లో మస్క్.. ట్విటర్‌ను సొంతం చేసుకోనున్న విషయం తెలిసిందే.
‘2024 ఎన్నికల్లో మిత విభజనవాద అభ్యర్థి బరిలో ఉండటం మంచిదని భావిస్తున్నా. అయినప్పటికీ.. ట్రంప్‌ను ట్విటర్లో పునరుద్ధరించాలని అనుకుంటున్నా’ అని మస్క్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. గతేడాది జనవరిలో క్యాపిటల్ అల్లర్ల సమయంలో హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం నైతికంగా తప్పు అని, మూర్ఖత్వమని మస్క్ గతంలో అభిప్రాయపడ్డారు. అయితే, మస్క్ తన ఖాతాను పునరుద్ధరించినప్పటికీ.. ట్విటర్‌కు తిరిగి రానని, తన సొంత సోషల్ మీడియా యాప్ ‘ట్రూత్ సోషల్’ను వినియోగిస్తానని ట్రంప్ ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ యాప్ ఫిబ్రవరి చివర్లో అందుబాటులోకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్‌లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్‌కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్‌కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు