Ukraine Crisis: స్వీడన్‌, ఫిన్లాండ్‌కు యూకే భరోసా..!

రష్యా నుంచి హెచ్చరికలు ఎదుర్కొంటున్న రెండు దేశాలకు యూకే అండగా నిలిచింది. ఈ విషయాన్ని స్వీడన్‌ పర్యటనలో ఉన్న యూకే అధ్యక్షుడు బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు.

Published : 11 May 2022 19:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా నుంచి హెచ్చరికలు ఎదుర్కొంటున్న రెండు దేశాలకు యూకే అండగా నిలిచింది. ఈ విషయాన్ని స్వీడన్‌ పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. ఆయన స్వీడన్‌ పర్యటనలో భాగంగా ఓ కీలక రక్షణ ఒప్పందం చేసుకొన్నారు. ఈ మేరకు స్వీడన్‌ ప్రధాని మాగ్డలీనా అండర్సన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం స్వీడన్‌ సంక్షోభ సమయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు బ్రిటన్‌ సాయానికి వస్తుందని పేర్కొన్నారు. 

‘‘మేము నిస్సందేహంగా, నమ్మకంగా స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాలకు మద్దతుగా నిలుస్తాము. తాజాగా చేసుకొంటున్న ఈ ఒప్పందాలు అంతులేని నమ్మకానికి చిహ్నంగా ఉంటాయి’’ అని బోరిస్‌ జాన్సన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 

జాన్సన్‌ మరో 24 గంటల్లో ఫిన్లాండ్‌ను సందర్శించనున్నారు. అక్కడ కూడా ఇటువంటి ఒప్పందాన్నే ఆ దేశాధినేత నినిస్టోతో చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ దేశాల సమీపంలో బ్రిటన్‌కు చెందిన రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌, బ్రిటిష్‌ ఆర్మీ, రాయల్‌ నేవీ దళాలు ఇప్పటికే భారీ ఎత్తున మోహరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని