Parliament: కెన్యా పార్లమెంటు ముట్టడి హింసాత్మకం.. పలువురు మృతి!

కెన్యా పార్లమెంటును ముట్టడించిన వేలాదిమంది ఆందోళనకారులు.. లోపలికి చొరబడి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.

Published : 25 Jun 2024 21:23 IST

నైరోబీ: పన్నుల పెంపునకు సంబంధించిన బిల్లుకు వ్యతిరేకంగా కెన్యాలో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో పార్లమెంటును ముట్టడించిన వేలాదిమంది ఆందోళనకారులు రెచ్చిపోయారు. పార్లమెంటు ప్రాంగణంలో పలు భాగాలకు నిప్పంటించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించడంతోపాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు సమాచారం.

నేరాంగీకారానికి అసాంజే సిద్ధం.. అమెరికాతో ఒప్పందం!

జీవన వ్యయం భారంతో సతమతమవుతోన్న కెన్యాలో.. పన్నులను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ఇటీవల ఓ బిల్లును తీసుకువచ్చింది. ఆ ఆర్థిక బిల్లుకు తాజాగా పార్లమెంటు ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు సంతకం చేసేందుకు దాన్ని పంపించడమే తరువాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ అనేక నగరాల్లో నిరసనలకు పిలుపునివ్వగా.. పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అటు పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు వేలాదిమంది ఆందోళనకారులు ప్రయత్నించారు. బారికేడ్లను చొచ్చుకొని రావడంతో భద్రతా సిబ్బంది వారిని కట్టడి చేసేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవడంతోపాటు కొందరు మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని