Kim Jong Un: 40 రోజుల నుంచి కిమ్‌ జాడ లేదు..!

బాహ్యప్రపంచానికి దూరంగా కిమ్‌(Kim Jong Un) .. 40 రోజుల నుంచి ఎవరికీ కనిపించడం లేదు. ఈ అంశం అక్కడ పలు అనుమానాలకు తావిస్తోంది.

Updated : 07 Feb 2023 15:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) దాదాపు నెల రోజుల నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించడంలేదు. ఈ వారం ఆ దేశ రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ 75వ వార్షికోత్సవ పరేడ్‌ జరగనుంది. ఈ సమయంలో దేశాధినేత సుదీర్ఘకాలం పాటు కనిపించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం బాగోలేదని ప్రచారం జరుగుతోంది. 2014 తర్వాత కిమ్‌(Kim Jong Un) దాదాపు 40 రోజులపాటు అదృశ్యం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆదివారం జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు.

ప్యాంగ్‌యాంగ్‌లో ఉ.కొరియా సైన్యం సైనిక కవాతుకు ఏర్పాట్లు భారీగా  జరుగుతున్నాయి. ఆ సైన్యం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ దేశం సొంతంగా తయారు చేసిన క్షిపణులు, అణ్వాయుధాలను ఈ పరేడ్‌లో ప్రదర్శించే అవకాశాలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరకొరియా సాధాన చేస్తున్న దృశ్యాలను వాణిజ్య ఉపగ్రహాలు గుర్తించాయి.

 సోమవారం జరిగిన మిలటరీ కమిషన్‌ సమావేశానికి మాత్రం కిమ్‌(Kim Jong Un) అధ్యక్షత వహించినట్లు స్థానిక మీడియా కథనంలో పేర్కొంది. కానీ, ఎలాంటి ఫొటోలను విడుదల చేయలేదు. కీలక రాజకీయ సైనిక అంశాలపై ఆయన చర్చించినట్లు వెల్లడించింది. యుద్ధ సన్నద్ధతను మరింత పెంచుకోవాలని ఆయన పేర్కొన్నట్లు కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ పేర్కొంది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ దక్షిణ కొరియా సందర్శించడాన్ని ఉత్తరకొరియా గత వారం తప్పుపట్టింది. అమెరికా ఉద్రిక్తత పాలసీలను అనుసరించినంత కాలం తాము చర్చలకు సిద్ధపడమని గత గురువారం తేల్చిచెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని