Kremlin: రష్యా రేడియోలు హ్యాక్.. పుతిన్ పేరిట నకిలీ సందేశం ప్రసారం!
రష్యా రేడియో కేంద్రాలు హ్యాకింగ్ బారిన పడ్డాయి. ఈ క్రమంలో దేశాధ్యక్షుడు పుతిన్ పేరిట ఓ నకిలీ సందేశం ప్రసారమైంది. క్రెమ్లిన్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
మాస్కో: ఏడాదిన్నరకు పైగా సాగుతోన్న సైనిక చర్య క్రమంలో భారీ దాడులకు గురైన ఉక్రెయిన్ (Ukraine).. పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో రష్యా (Russia)పై ఎదురుదాడులకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. కొంత కాలంగా డ్రోన్ దాడులతోపాటు రష్యాలోని బెల్గొరాడ్ (Belgorod) ప్రాంతంలో చొరబాటు యత్నాలు మాస్కోను కలవరపరుస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ తాజాగా రష్యా రేడియో స్టేషన్‌లు హ్యాకింగ్ (Hacking) బారిన పడ్డాయి. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు పుతిన్(Putin) పేరిట నకిలీ సందేశం ప్రసారమైంది. ఉక్రెయిన్ సరిహద్దులోని రష్యా ప్రాంతాల్లో కీవ్ బలగాలు ఆక్రమణకు దిగాయని, ఈ క్రమంలోనే అత్యవసర చర్యలు తీసుకుంటున్నట్లు ఆ సందేశంలో ఉంది. క్రెమ్లిన్ (Kremlin) సోమవారం ఇదే విషయాన్ని వెల్లడిస్తూ.. రేడియో కేంద్రాలను ఎవరో హ్యాక్ చేసినట్లు తెలిపింది.
‘నాటో దేశాల ఆయుధ సాయం, అమెరికా దన్నుతో ఉక్రెయిన్ బలగాలు.. రష్యాలోని కుర్స్క్, బెల్గొరాడ్, బ్రయాన్స్క్ భూభాగాలను ఆక్రమించాయి. దీంతో ఈ మూడు ప్రాంతాల్లో మార్షల్ లా విధించడంతోపాటు సైనిక సమీకరణ, పౌరుల తరలింపు చర్యలు చేపడుతున్నాం’ అని పుతిన్ మాదిరి స్వరంతో సందేశం ప్రసారమైంది. అయితే, ఇదంతా హ్యాకింగ్ వల్లే జరిగిందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. రేడియో వ్యవస్థను ఇప్పటికే పునరుద్ధరించామన్నారు. బెల్గొరాడ్ పాలనా యంత్రాంగం సైతం ఈ సందేశాన్ని ‘డీప్ ఫేక్’గా కొట్టిపారేసింది. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలా చేసినట్లు ఆరోపించింది. పొరుగున ఉన్న వోరోనెజ్ ప్రాంత అధికారులు కూడా.. భయపడాల్సిన అవసరం లేదని తమ పౌరులకు సూచించారు. ఇదొక రెచ్చగొట్టే చర్య అని మిర్ రేడియో స్టేషన్ మండిపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddharth: కన్నడ ప్రజల తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు: ప్రకాశ్ రాజ్
-
Canada: హంతకులకు ఆశ్రయం ఇస్తున్నారు.. కెనడాపై బంగ్లాదేశ్ మంత్రి తీవ్ర ఆరోపణలు
-
Imran Tahir: 44 ఏళ్ల వయసులోనూ తాహిర్ జోరు.. ధోని రికార్డు బద్దలు కొట్టి..
-
Trump: అమెరికాలో ఏదో జరగబోతోంది.. : జోబైడెన్ ఆందోళన
-
Papam Pasivadu Review: రివ్యూ: పాపం పసివాడు.. సింగర్ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ