Ukraine Crisis: రోజుకు దాదాపు 200 మంది ఉక్రెయిన్‌ సైనికుల మరణం..!

రష్యాతో జరుగుతున్న యుద్ధంలో నిత్యం దాదాపు 200 మంది సైనికులు మృత్యువాత పడుతున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ప్రతినిధి మిఖాయిల్‌ పొడొల్యాక్‌ పేర్కొన్నారు.

Updated : 10 Jun 2022 13:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాతో జరుగుతోన్న యుద్ధంలో నిత్యం దాదాపు 100 నుంచి 200 మంది సైనికులు మృత్యువాత పడుతున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ప్రతినిధి మిఖాయిల్‌ పొడొల్యాక్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి వందల సంఖ్యలో శతఘ్నుల అవసరం ఉందని ఆయన వెల్లడించారు.  మాస్కోతో శాంతి చర్చలు జరిపేందుకు కీవ్‌ ఏమాత్రం సుముఖంగా లేదని స్పష్టం చేశారు. డాన్‌బాస్‌ స్వాధీనం కోసం రష్యా దళాలు జరుపుతోన్న కర్కశమైన దాడుల్లో ఉక్రెయిన్‌ దళాలు చిక్కుకొన్నాయని వివరించారు. ‘‘రష్యా దళాలు అణ్వాయుధాలు మినహా ప్రతి ఒక్కదాన్ని యుద్ధ భూమికి తీసుకొస్తున్నాయి. వీటిల్లో భారీ శతఘ్నులు, మల్టిపుల్‌ రాకెట్‌ లాంఛర్లు, విమానాలు వంటివి ఉన్నాయి’’ అని మిఖాయిల్‌ పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌కు ఆయుధ అవసరాలు తీవ్రంగా ఉన్నాయని మిఖాయిల్‌ గుర్తుచేశారు. రష్యా ఆయుధ బలం ముందు ఉక్రెయిన్‌ ఆయుధ బలం సరిపోకపోవడంతో తమ వైపు మరణాలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ఉక్రెయిన్‌కు 150 నుంచి 300 రాకెట్‌ లాంఛర్లు వ్యవస్థలు అవసరమని ఆయన వివరించారు. రష్యా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి స్వాధీనం చేసుకొన్న భూమిని తిరిగి అప్పగిస్తేనే చర్చలు పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని