UkraineCrisis: మేము పిశాచంతో పోరాడుతున్నాం: జెలెన్‌స్కీ

యుద్ధం కారణంగా తాము డాన్‌బాస్‌ ప్రాంతంలో భారీ మూల్యం చెల్లిస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాన్లు సెవీరోదొనెట్స్క్‌ను స్వాధీనం చేసుకోడంపై పూర్తిగా

Published : 14 Jun 2022 12:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యుద్ధం కారణంగా తాము డాన్‌బాస్‌ ప్రాంతంలో భారీ మూల్యం చెల్లిస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యన్లు సెవీరోదొనెట్స్క్‌ను స్వాధీనం చేసుకోడంపై పూర్తిగా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ యుద్ధం కోసం చెల్లిస్తోన్న మూల్యం భయపెట్టేంత పెద్దది. డాన్‌బాస్‌లో పోరాటం నిస్సందేహంగా సైనిక చరిత్రలో అత్యంత ఖరీదైన యుద్ధంగా నిలిచిపోతుంది. మేం పిశాచంతోనే పోరాడుతున్నాం. మాకు ఆ ప్రదేశానికి విముక్తినివ్వడం మినహా మారో మార్గం లేదు. మేం ప్రతి ఒక్కదానిని అక్కడ పునర్‌ నిర్మించుకోవాలి. ఆక్రమణదారులు మొత్తం ధ్వంసం చేశారు’’ అని వ్యాఖ్యానించారు.

మరోపక్క ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను అమెరికా వేగవంతం చేసింది. ఈ వారం మొదట్లో మరికొంత సైనిక సాయం కీవ్‌కు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఉక్రెయిన్‌కు శిక్షణ, పరికరాలు, సలహాలు వంటివి కూడా అందనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే వారం అదనపు ఆయుధాలతో కూడిన మరో ప్యాకేజీని ప్రకటించవచ్చని తెలిపారు. ఇప్పటికే మొత్తం 11 ప్యాకేజీల రూపంలో అమెరికా సాయం ఉక్రెయిన్‌కు చేరింది. గత నెలలో అమెరికా కాంగ్రెస్‌ మొత్తం 40 బిలియన్‌ డాలర్లను కీవ్‌కు సాయంగా అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని