అక్రమ బంగారం కోసం వెళ్లి.. 12 మంది అనంతలోకాలకు...

బంగారం తవ్వగా మిగిలిన ముక్కలను ఏరుకోవడానికి 14 మంది మహిళలు వెళ్లారు. ఆదే సమయంలో పక్కనే ఉన్న కొండచరియలు విరిగిపడడంతో 12 మంది చనిపోయారు.

Published : 29 Apr 2022 15:28 IST

మెడాన్ (ఇండోనేషియా): అక్రమ బంగారు గనుల్లో తవ్వకాల కోసం వెళ్లి 12 మంది చనిపోయారు. కొండచరియలు విరిగిపడడంతో వీరంతా మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర సుమత్రాలోని మాండయిలింగ్ నాటల్ జిల్లాలోని ఓ గ్రామంలో బంగారు గని ఉంది. ఇక్కడ  తరచు బంగారం తవ్వకాలు జరుగుతుంటాయి. అయితే బంగారం తవ్విన అనంతరం అక్కడ ఇంకా ఏమైనా బంగారం ముక్కలు దొరుకుతాయేమోనని ఆ చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు వెళ్తుంటారు. గురువారం కూడా కొందరు మహిళలు అలాగే వెళ్లారు. ఆదే సమయంలో కొండచరియలు విరిగిపడడంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్నఅధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని