Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్(Sanna Marin) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలో కేరింతలు, డ్యాన్సులు చేసిన వీడియో వైరల్‌గా మారింది...
డ్రగ్స్ తీసుకోలేదని వివరణ
హెల్సింకి: ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్(Sanna Marin) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలో కేరింతలు, జోరుగా నృత్యాలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి ప్రతిపక్షాలు.. ఆమె డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చని ఆరోపిస్తున్నాయి. దీంతో స్పందించిన ప్రధాని (Finland Prime Minister).. తాను ఎటువంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. కేవలం మిత్రులతో ప్రైవేట్ పార్టీ(Sanna Marin Party) సందర్భంగా ఆనందంతో నృత్యాలు చేసినట్టు వివరణ ఇచ్చారు.
ప్రధానమంత్రి సనా మారిన్ (Sanna Marin)తో సహా ఆరుగురు మహిళలు డ్యాన్స్‌లు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో నేలపై మోకాళ్లపై కూర్చొని సనా మారిన్ ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించారు. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేతలు.. ఆమె డ్రగ్స్ తీసుకున్నారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమెకు డ్రగ్ టెస్టు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా తనపై వచ్చిన ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు. ఆ వీడియో లీక్ కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదన్నారు.
‘ఓ రోజు సాయంత్రం మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నాం. ఆ సందర్భంగా డ్యాన్సులు, పాటలు పాడటం వాస్తవమే. ప్రైవేటుగా చేసుకున్న ఆ పార్టీ వీడియో లీక్ కావడం దురదృష్టకరం. కేవలం ఆల్కహాల్ తప్ప ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు. మేం చేసినవన్నీ చట్టానికి లోబడినవే. ఎలాంటి తప్పూ చేయలేదు’ అంటూ వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Flight Journey: ‘లావుగా ఉన్నామని విమానం నుంచి దించేశారు’
లావుగా ఉన్నారనే నెపంతో ఇద్దరు మహిళలను విమానం నుంచి దించేసిన దారుణ ఘటన ఎయిర్ న్యూజిలాండ్‌లో (New Zealand) చోటుచేసుకుంది. -
Israel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్‌లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్‌లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
-
తెలంగాణ నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్‌తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్‌ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్