USA: అమెరికాలో దీపావళి సెలవు..? కాంగ్రెస్‌లో బిల్లు
వెలుగుల పండగ దీపావళి (Diwali)ని అమెరికా (America)లోనూ సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ ఆ దేశ కాంగ్రెస్‌లో ఓ బిల్లును తీసుకొచ్చారు. కాంగ్రెస్ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు సంతకం చేస్తే దీపావళి సెలవు అమల్లోకి రానుంది.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా (USA)లో దీపావళి (Diwali) పర్వదినానికి సెలవు (Holiday) ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ వెలుగుల పండగను సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ చట్టసభ్యురాలు గ్రేస్డ్ మెంగ్ యూఎస్ కాంగ్రెస్ దిగువ సభ అయిన ప్రతినిధుల సభ (House of Representatives)లో శుక్రవారం బిల్లును ప్రవేశపెట్టారు. ‘దీపావళి డే యాక్ట్ (Diwali Day Act)’ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లును అమెరికా వ్యాప్తంగా పలు కమ్యూనిటీలు స్వాగతించాయి.
‘‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి దీపావళి (Diwali) చాలా ముఖ్యమైన రోజు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండగను నిర్వహించడం విశేషం. న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతంలో పలు కమ్యూనిటీలు ఈ పండగను వైభవంగా నిర్వహిస్తాయి. దీపావళిని ఫెడరల్ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటిస్తే.. కుటుంబాలు కలిసి వేడకలు చేసుకునేందుకు వీలుంటుంది. అంతేగాక, విభిన్న సంస్కృతులకు ప్రభుత్వం ఇచ్చే విలువను చాటుతుంది’’ అని మెంగ్ తన బిల్లులో పేర్కొన్నారు.
ఈ బిల్లు కాంగ్రెస్ (US Congress)లో ఆమోదం పొంది.. అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత అగ్రరాజ్యంలో దీపావళిని సెలవు దినంగా ప్రకటించేందుకు వీలు లభిస్తుంది. అది జరిగితే, అమెరికాలో ఫెడరల్ గుర్తింపు పొందిన 12వ సెలవుగా దీపావళి నిలవనుంది. ఈ బిల్లును భారత సంతతి చట్టసభ్యులు, పలు కమ్యూనిటీల నేతలు స్వాగతిస్తున్నారు. కాగా.. దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ 2021లోనూ యూఎస్ కాంగ్రెస్‌లో ఓ బిల్లును ప్రవేశపెట్టగా.. పలు కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు.
ఇదిలా ఉండగా.. దీపావళి (Diwali) పర్వదినంతో పాటు చాంద్రమాన కొత్త సంవత్సరం రోజున న్యూయార్క్‌లో సెలవు ప్రకటించాలంటూ గత కొన్నేళ్లుగా చట్టసభ సభ్యులు, ప్రవాస సభ్యుల చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించనుంది. ఆ రెండు రోజులను సెలవులుగా ప్రకటించేందుకు చట్టాన్ని రూపొందించాలని న్యూయార్క్ అసెంబ్లీ భావిస్తోంది. న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రజల విభిన్న సంస్కృతిని గుర్తించాల్సిన అవసరం ఉందని, దీపావళి, చాంద్రమాన కొత్త సంవత్సరం రోజును సెలవు దినాలుగా ప్రకటించేందుకు గాను అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు చట్టాన్ని ఆమోదిస్తామని అసెంబ్లీ స్పీకర్ కార్ల్ హేస్టీ తెలిపారు. పాఠశాల క్యాలెండరులో అమలు చేసే విషయమై చర్చలు కొనసాగిస్తామని వివరించారు. సెలవుల కోసం ప్రతిపాదించిన బిల్లుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసే (జూన్ 8)లోపు ఆమోదం లభించే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం