Ukraine Crisis: చీకటిలో లివివ్‌.. పవర్‌ ప్లాంట్‌ ధ్వంసం..!

ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల ఆయుధ సరఫరాలో కీలక మజిలీ అయిన లివివ్‌పై రష్యా విరుచుకుపడింది. మూడు రష్యా క్షిపణులు ఈ నగరానికి విద్యుత్తు సరఫరా చేసే

Published : 04 May 2022 14:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల ఆయుధ సరఫరాలో కీలక మజిలీ అయిన లివివ్‌పై రష్యా విరుచుకుపడింది. ఈ నగరానికి విద్యుత్తు సరఫరా చేసే ప్లాంట్‌పై మూడు రష్యా క్షిపణులు పడ్డాయి. దీంతో అక్కడ విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయింది. దాదాపు వారం తర్వాత రష్యా దళాలు లివివ్‌పై చేసిన దాడి ఇది. రాత్రి 8.30 సమయంలో పలు దిశల నుంచి క్షిపణులు నగరంపైకి దూసుకొచ్చాయి. దాదాపు గంటన్నరసేపు ఎయిర్‌ రైడ్‌ సైరన్లు మోగాయి. గతంలో రష్యా ఈ నగరంలోని రైలు నెట్‌వర్క్‌పై దాడులు చేసింది.

ఈ దాడులపై మేయర్‌ ఆండ్రీ సడోవి స్పందిస్తూ.. ‘‘మూడు విద్యుత్తు స్టేషన్లు నిలిచిపోయాయి. రెండు పంపు స్టేషన్లకు కూడా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా నగరవాసులకు తాగు నీరు అందడంలేదు’’ అని తెలిపారు.

ఉక్రెయిన్‌లోని లివివ్‌ నగరం పోలాండ్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ నగరం మీదుగానే ఐరోపా సమాఖ్య, అమెరికా నేతలు కీవ్‌ను సందర్శించారు. దీంతోపాటు ఉక్రెయిన్‌ దళాలకు పశ్చిమదేశాల ఆయుధ సరఫరాలో ఇది కీలక కేంద్రం. వివిధ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు మద్దుతుగా పోరాడేందుకు వస్తున్న వారికి కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నట్లు రష్యా ఆరోపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని