Lion: కాపలాదారుడ్ని చంపి బోనులో నుంచి తప్పించుకుపోయిన సింహాలు

ఇరాన్‌లోని ఓ జంతు ప్రదర్శనశాలలో భయానక ఘటన చోటుచేసుకుంది. కాపలాదారుడిపై దాడిచేసి చంపిన ఓ సింహం మరో సింహంతో కలిపి పారిపోయింది......

Published : 01 Feb 2022 01:17 IST

తెహ్రాన్‌: ఇరాన్‌లోని ఓ జంతు ప్రదర్శనశాలలో భయానక ఘటన చోటుచేసుకుంది. కాపలాదారుడిపై దాడిచేసి చంపిన ఓ సింహం మరో సింహంతో కలిపి పారిపోయింది. మర్కాజీ ప్రావిన్స్‌ అరక్‌లోని జూలో చాలా కాలంలో ఓ సింహం జీవిస్తోంది. అయితే ఎలాగోలా ఆ బోను తలుపు తెరవగలిగిన సింహం.. ఆహారాన్ని అందించేందుకు వెళ్లిన కాపలాదారుడి(40)పై దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దాడి అనంతరం ఆ సింహం సహచర మృగరాజుతో కలిసి బోనులోనుంచి తప్పించుకుపోయింది.

వెంటనే అప్రమత్తమైన జూ సిబ్బంది విషయాన్ని పైఅధికారులకు తెలియజేశారు. దీంతో ఆ జూను భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రావిన్స్‌ గవర్నర్‌ ఆమిర్‌ హాది మీడియాకు వెల్లడించారు. పారిపోయిన ఆ సింహాలను తిరిగి పట్టుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని