Viral Video: బోనులోంచి తప్పించుకున్న సింహాలు.. ప్రాణ భయంతో జనం పరుగులు!
సర్కస్‌లో విన్యాసాలు చూస్తుండగా ఎన్‌క్లోజర్ నుంచి రెండు సింహాలు తప్పించుకోవడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బీజింగ్: బోనులో బంధించిన సింహాలను దగ్గరి నుంచి చూడాలంటేనే వణుకుతాం. అలాంటిది ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకున్న ఆ మృగాలు ఒక్కసారిగా మనపైకి దూసుకొస్తే..! గుండె ఆగినంత పని అవుతుంది కదా! సరిగ్గా ఇలాంటి ఘటనే చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లుయోయాంగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సర్కస్‌లో విన్యాసాలను వీక్షిస్తూ ఆనందిస్తున్న జనంపైకి ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకున్న రెండు సింహాలు ఒక్కసారిగా దూసుకురావడంతో వారంతా ప్రాణాలను అరచేతిలో పట్టుకొని భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఒళ్లుగగుర్పాటుకు గురిచేసే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ సర్కస్ ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో నిర్వాహకులు సింహాలతో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఓ రింగ్ లోంచి దూకేందుకు సింహాలు మొరాయించడంతో వాటితో బలవంతంగా విన్యాసాలు చేయించేందుకు ట్రైనర్లు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లో సరిగా లాక్ చేయని డోర్ నుంచి రెండు సింహాలూ ఒక్కసారిగా బయటకు దూకాయి.
దీంతో గ్యాలరీల్లో కూర్చొని వీక్షిస్తున్న జనానికి ఏం చేయాలో తెలియక భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అప్రమత్తమైన నిర్వాహకులు ఆ సింహాలను త్వరగా పట్టుకొని తిరిగి బోనులో బంధించారు. ఈ ఘటనతో సర్కస్‌ను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. ఆ సింహాలు ఎలా తప్పించుకున్నాయనేది మాత్రం సర్కస్ నిర్వాహకులు వెల్లడించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నిర్వాహకులపై జంతుప్రేమికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్ ఇదే!
-
Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్
-
Nene Naa Movie ott: ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Social Look: శ్రద్ధాదాస్ ‘లేజర్ ఫోకస్’.. బెంగళూరులో నభా.. రకుల్ ‘ఫెస్టివ్ మూడ్’!
-
Congress: కాంగ్రెస్ తొలి జాబితాపై స్పష్టత.. 70 స్థానాలకు అభ్యర్థుల ఖరారు?
-
Chandrababu arrest: చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం