బద్ధకస్థులకు ఆపద్బాంధవుడు ఫ్రెడ్డీ.. క్యూల్లో నిలబడి రోజుకు రూ.16 వేలు సంపాదన

గంటల తరబడి క్యూలో నిలబడాలంటే చాలామందికి చిరాకు. ఒక్కోసారి ఓపిక నశించి వచ్చిన పని పూర్తి చేసుకోకుండానే

Updated : 22 Jan 2022 09:40 IST

లండన్‌: గంటల తరబడి క్యూలో నిలబడాలంటే చాలామందికి చిరాకు. ఒక్కోసారి ఓపిక నశించి వచ్చిన పని పూర్తి చేసుకోకుండానే వెనుదిరుగుతుంటారు. ఇలా బద్ధకించే ప్రబుద్ధులకు ఆపద్బాంధవుడిలా బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెకిట్‌ (31) క్యూల్లో నిల్చొని రోజుకు రూ.16 వేలు సంపాదిస్తున్నాడు. గంటకు 20 యూరోలు (దాదాపు రూ.2 వేలు) ఛార్జ్‌ చేసే ఫ్రెడ్డీ రోజూ తన క్లయింట్స్‌ కోసం 8 గంటలు క్యూలో నిల్చుంటాడు. బ్రిటన్‌లో తరచూ ఈవెంట్లు జరుగుతాయి. వీటి టికెట్లు కావాలంటే కనీసం గంటైనా క్యూలో నిల్చోవాలి. శీతాకాలంలో ఎక్కువమంది తనను ఈ పని కోసం సంప్రదిస్తుంటారని ఫ్రెడ్డీ తెలిపాడు. తక్కువ నైపుణ్యం అవసరమయ్యే ఈ పనితో బాగానే సంపాదిస్తున్నప్పటికీ, ఫుల్‌టైం జాబ్‌ వేరే చూసుకుంటానని చెప్పాడు. నిలబడటంలో తన నైపుణ్యాల గురించి ఇతను టాస్క్‌ర్యాబిట్‌ (ఆన్‌లైన్‌ వేదిక)లో ప్రకటన కూడా ఇచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని