Emmanuel Macron: రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మెక్రాన్
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ రెండోసారి ఎన్నికై అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నారు. ఆయన తన ప్రత్యర్థి మరీన్ లీ పెన్‌పై విజయం సాధించారు.
ఇంటర్నెట్‌డెస్క్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ రెండోసారి ఎన్నికై అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి మరీన్ లీ పెన్‌పై విజయం సాధించారు. ఫ్రెంచి ఇంటీరియర్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం మెక్రాన్‌కు రెండో రౌండ్లో 58.55శాతం ఓట్లు రాగా.. లీపెన్‌కు 41.45శాతం ఓట్లు వచ్చాయి. ఫ్రాన్స్‌లో రెండోసారి ఎన్నికైన అధ్యక్షులు గతంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. తాజాగా మెక్రాన్ కూడా ఆ జాబితాలో చేరారు. పలువురు ప్రపంచ నేతలు మెక్రాన్‌కు అభినందనలు తెలియజేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా మెక్రాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇండో-ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మెక్రాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా మెక్రాన్ విజయాన్ని స్వాగతించారు. ఆయన ట్విటర్ వేదికగా ఫ్రాన్స్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పారు. బ్రిటన్‌కు ఫ్రాన్స్ అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని జాన్సన్ అన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాలు పరస్పర సంబంధాల విషయంలో, ప్రపంచ స్థాయి అంశాల్లో కలిసి పనిచేయడాన్ని కొనసాగిస్తాయని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్