Viral video: స్పీకర్‌జీ.. సూటిగా చూడరేం.. ఎంపీ వీడియో వైరల్‌

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఓ సరదా సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated : 01 Jul 2024 18:06 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి జర్తాజ్ గుల్(Zartaj Gul) సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడుతున్నా స్పీకర్‌ సాధిక్‌(Sadiq) చూడకపోవడంతో జర్తాజ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నా పార్టీ నాకు ఇతరుల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం నేర్పింది. నేను ప్రజల తరపున వచ్చిన నాయకురాలిని. 1,50,000 ఓట్లతో ఈ సభలో అడుగుపెట్టాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా నావైపు చూడకుండా ఉంటే మాట్లాడలేను. దయచేసి మీరు కళ్లజోడు పెట్టుకొని నాపైపు చూడండి’’  అంటూ ఆమె స్పీకర్‌ను కోరారు. దీనికి స్పీకర్‌ చమత్కారంగా స్పందిస్తూ.. నేను మీ మాటలు వింటాను. కానీ, మహిళల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం మర్యాదగా అనిపించదు. అందుకే మిమ్మల్ని సూటిగా చూడట్లేదని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. 

అనంతరం జర్తాజ్ గుల్ మాట్లాడుతూ మహిళలను సూటిగా చూడకూడదని మీరు అనుకొని సభలో 52శాతం మహిళలను తొలగిస్తే మీరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే సభలో పాల్గొంటారు అంటూ కౌంటర్‌ వేశారు. ఈ వీడియోను పాక్ మీడియా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని