ఘోరం: తనను చూసి నవ్వారని.. నిలబెట్టి ఏడుగురిని చంపేశాడు..!
చాలా దేశాల్లో తుపాకీ సంస్కృతి పేట్రేగిపోతోంది. దీంతో చిన్న చిన్న విషయాలకే మనుషులు తోటివారి ప్రాణాలు బలితీసుకుంటున్నారు. తాజాగా బ్రెజిల్ (Brazil)లో నవ్వారన్న కోపంతో ఓ వ్యక్తి ఏడుగురిని చంపేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్ (Brazil)లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆటలో ఓడిపోయిన తనను చూసి నవ్వారని.. ఓ వ్యక్తి వారిపై విచక్షణారహితంగా కాల్పులు (Gun Firing) జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మాటో గ్రోసో రాష్ట్రంలోని సినోప్ నగరానికి చెందిన ఎడ్గర్ రికార్డో డి ఒలివిరా గత మంగళవారం స్థానిక పూల్ హాల్ (Pool Hall)కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తితో 4000 రియాస్ (బ్రెజిల్ కరెన్సీ)కు పందెం కాసి పూల్ గేమ్ (Pool Game)లో ఓడిపోయాడు. దీంతో అసహనానికి గురైన ఒలివిరా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటికి తన స్నేహితుడు ఎజిక్వియాస్ సౌజా రెబిరోతో అక్కడికి వచ్చిన ఒలివిరా.. మళ్లీ అదే వ్యక్తితో పందెం కాశారు. రెండోసారి కూడా అతడు ఓడిపోవవడంతో పూల్ హాల్‌లో ఉన్న కొందరు అతడిని చూసి నవ్వారు.
దీంతో కోపోద్రిక్తులైన ఒలివిరా, అతడి స్నేహితుడు దారుణానికి పాల్పడ్డారు. రెబిరో గన్‌తో బెదిరించి అక్కడున్నవారిని వరుసలో నిలబెట్టగా.. ఒలివిరా వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పూల్ యజమాని సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?