Viral News: వామ్మో.. ఇదేం ‘మాస్క్‌’రా బాబూ!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మళ్లీ అందరూ మాస్కు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాలోని ఓ వ్యక్తి ధరించిన మాస్కు అందర్నీ ఆకట్టుకుంటోంది.

Published : 24 Dec 2022 16:31 IST

బీజింగ్‌: చైనా (China) లో కరోనా కేసులు (Corona Virus) ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని అక్కడి  ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అంతేకాకుండా కొవిడ్‌ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయాలని నిర్ణయించింది. మాస్కు (Mask)ను తప్పనిసరి చేసింది. అయితే, ఏది తినాలన్నా, తాగాలన్నా మాస్కును తీయాల్సిందే. ఈ క్రమంలో వైరస్‌ సోకే అవకాశాలు లేకపోలేదు. అందుకే అక్కడ వినూత్నంగా తయారు చేసిన మాస్కులు దర్శనమిస్తున్నాయి. పక్షి ముక్కు ఆకారంలో తయారు చేసిన మాస్కు (Beak Shaped Face mask)  అందర్నీ ఆకట్టుకుంటోంది. ఒకసారి పెట్టుకుంటే..దీనిని తీయాల్సిన అవసరం లేదు. నోరు తెరిస్తే.. ఆటోమేటిక్‌గా అది కూడా తెరుకుంటుంది. నోరు మూసేస్తే.. మూసుకుపోతుంది. చైనాలోని రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ఈ మాస్కు ధరించి ఆహారం తింటుండటం ఆందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను దిల్లీకి చెందిన సఫీర్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని