Pakistan: ఇమ్రాన్‌జీ.. పాక్‌ వదిలి, భారత్‌ వెళ్లిపోండి..

‘పొరుగున ఉన్న భారత్‌ సార్వభౌమ దేశం. ప్రపంచంలో మరే శక్తీ ఆ దేశాన్ని శాసించలేదు’ అంటూ శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. నేడు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న నేపథ్యంలో ఆయన నోట నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

Published : 09 Apr 2022 10:12 IST

ఇస్లామాబాద్‌: ‘పొరుగున ఉన్న భారత్‌ సార్వభౌమ దేశం. ప్రపంచంలో మరే శక్తీ ఆ దేశాన్ని శాసించలేదు’ అంటూ శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. నేడు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న నేపథ్యంలో ఆయన నోట నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. పాక్‌ను వదిలి.. భారత్‌ వెళ్లిపోవాలని విమర్శించాయి.

‘చేతిలో నుంచి అధికారం పోతోందని ఆ వ్యక్తి పిచ్చెక్కిపోతున్నారు. మరెవరూ కాదు, సొంతపార్టీ వాళ్లే ఆయన్ను బహిష్కరించారని ఆయనకు ఎవరైనా చెప్పండి. మీకు భారత్‌ అంటే అంత ఇష్టమైతే అక్కడికే వెళ్లండి. పాకిస్థాన్‌ వీడండి’ అంటూ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ కుమార్తె మరియమ్ నవాజ్‌.. ఇమ్రాన్‌పై మండిపడ్డారు.

జాతీయ అసెంబ్లీ వద్ద భద్రత పెంపు..

అవిశ్వాస తీర్మానం కోసం జాతీయ అసెంబ్లీ సమావేశమవుతోన్న తరుణంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైతే.. తర్వాత ముందుకెళ్లాల్సిన ప్రక్రియను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మిత్రపక్షాలు, సొంతపార్టీ నేతలు ఇమ్రాన్‌కు దూరంగా జరగడంతో అధికార పీటీఐకు మెజార్టీ సభ్యులు లేరు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని