Melinda Gates: ఆ విడాకులతో అంతులేని వేదన అనుభవించా..!
దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడాకులు తీసుకున్నారు బిల్‌గేట్స్ - మెలిందా దంపతులు.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడాకులు తీసుకున్నారు బిల్‌గేట్స్ - మెలిందా దంపతులు. మైక్రోసాఫ్ట్ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కోసం కలిసి పనిచేస్తామని వారు ప్రకటించారు. తాజాగా మెలిందా ఫార్చ్యూన్ మేగజైన్‌తో మాట్లాడుతూ.. తన విడాకుల అంశంపై స్పందించారు. విడాకుల కారణంగా తాను అంతులేని వేదనను అనుభవించానని పేర్కొన్నారు.
‘వివాహ బంధంలో ఇమడలేకపోవడానికి నాకంటూ కొన్ని కారణాలు ఉన్నాయి. కొవిడ్ వల్ల నా విషయంలో ఓ మంచి జరిగింది. నాకు కావాల్సింది నేను చేయడానికి కావాల్సిన గోప్యతనిచ్చింది. విడాకుల వల్ల తీవ్రమైన వేదనను అనుభవించా. ఆ బాధను దాటుకొని రావడానికి నాకు గోప్యత ఉండేది. నేను విడిపోయిన వ్యక్తితోనే తరచూ పనిచేస్తుండేదాన్ని. ఉదయం తొమ్మిదింటికి ఏ వ్యక్తి వల్ల అయితే బాధపడేదాన్నో.. అదే వ్యక్తితో కలిసి పదింటికి కన్నీరు తుడుచుకొని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేదాన్ని’’ అని మెలిందా వెల్లడించారు.
తన విడాకుల గురించి గతంలో బిల్‌గేట్స్ కూడా స్పందించారు. ‘గత రెండు సంవత్సరాల్లో నా జీవితంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నా దృష్టిలో మాది గొప్ప వివాహం. జరిగిన దానిని నేను మార్చలేను. నేను వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అవకాశం వస్తే.. మెలిందానే మళ్లీ వివాహం చేసుకుంటా’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్‌లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్‌కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్‌కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
-
పార్ట్‌టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్