Melinda Gates: ఆ విడాకులతో అంతులేని వేదన అనుభవించా..!

దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడాకులు తీసుకున్నారు బిల్‌గేట్స్‌ - మెలిందా దంపతులు.

Published : 06 Oct 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడాకులు తీసుకున్నారు బిల్‌గేట్స్‌ - మెలిందా దంపతులు. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవడం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌ కోసం కలిసి పనిచేస్తామని వారు ప్రకటించారు. తాజాగా మెలిందా ఫార్చ్యూన్‌ మేగజైన్‌తో మాట్లాడుతూ.. తన విడాకుల అంశంపై స్పందించారు. విడాకుల కారణంగా తాను అంతులేని వేదనను అనుభవించానని పేర్కొన్నారు.

‘వివాహ బంధంలో ఇమడలేకపోవడానికి నాకంటూ కొన్ని కారణాలు ఉన్నాయి. కొవిడ్‌ వల్ల నా విషయంలో ఓ మంచి జరిగింది. నాకు కావాల్సింది నేను చేయడానికి కావాల్సిన గోప్యతనిచ్చింది. విడాకుల వల్ల తీవ్రమైన వేదనను అనుభవించా. ఆ బాధను దాటుకొని రావడానికి నాకు గోప్యత ఉండేది. నేను విడిపోయిన వ్యక్తితోనే తరచూ పనిచేస్తుండేదాన్ని. ఉదయం తొమ్మిదింటికి ఏ వ్యక్తి వల్ల అయితే బాధపడేదాన్నో.. అదే వ్యక్తితో కలిసి పదింటికి కన్నీరు తుడుచుకొని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేదాన్ని’’ అని మెలిందా వెల్లడించారు.

తన విడాకుల గురించి గతంలో బిల్‌గేట్స్‌ కూడా స్పందించారు. ‘గత రెండు సంవత్సరాల్లో నా జీవితంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నా దృష్టిలో మాది గొప్ప వివాహం. జరిగిన దానిని నేను మార్చలేను. నేను వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అవకాశం వస్తే.. మెలిందానే మళ్లీ వివాహం చేసుకుంటా’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు