New Words: ఫిన్‌స్టా.. గర్ల్‌బాస్‌.. షెఫ్స్‌ కిస్‌.. ‘జెనరేషన్‌ జడ్‌’ సరికొత్త పదాలు డిక్షనరీలోకి!

గ్రామబుల్‌.. ఫిన్‌స్టా.. ఇలాంటి 690 సరికొత్త పదాలను తమ డిక్షనరీలో చేర్చింది అమెరికాకు చెందిన ప్రముఖ ‘మెరియం- వెబ్‌స్టర్‌’ ప్రచురణ సంస్థ.

Updated : 02 Oct 2023 19:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తోన్న పదాలను, వాటి నిర్వచనాలను పాఠకులకు పరిచయం చేయడంలో డిక్షనరీ (Dictionaries)లు ముందుంటాయి. ముఖ్యంగా నవతరం నోళ్లలో నానుతున్న వినూత్న, ఆసక్తికర పదాలను ఒడిసిపడుతూ తమ నిఘంటువుల్లో పొందుపర్చుతాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ ‘మెరియం- వెబ్‌స్టర్‌ (Merriam-Webster)’ తన డిక్షనరీలో కొత్తగా 690 కొత్త పదాలను చేర్చినట్లు వెల్లడించింది. వాటిలో చాలా వరకు పదాలు జనరేషన్‌ ‘జడ్‌’ (GenZ)’ మెచ్చినవే.

కొవిడ్‌ వ్యాక్సిన్ల తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్తలకు నోబెల్‌..

డిజిటల్‌ ప్రపంచం, సాంకేతికతలు, గేమింగ్‌, సామాజిక వాతావరణం, ఆహారం, వాతావరణం, క్రీడలు ఇలా ఆయా రంగాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన పదాలను సేకరించి తమ డిక్షనరీలో పొందుపర్చినట్లు మెరియం- వెబ్‌స్టర్‌ తెలిపింది. ఈ కొత్త బ్యాచ్ పదాల విషయంలో  ఉత్సాహంగా, ఆసక్తిగా ఉన్నామని సంస్థ ప్రతినిధి పీటర్ సోకోలోవ్‌స్కీ చెప్పారు. ఈ కొత్త చేర్పులు విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయని తెలిపారు. ‘మెరియం- వెబ్‌స్టర్‌ నిఘంటువు’లో కొత్తగా చేర్చిన పదాల్లో కొన్ని..

  • గ్రామబుల్‌ (Grammable): అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేందుకు తగిన పోస్టు.
  • డాగో (Doggo): ఆంగ్లంలో శునకాన్ని పిలుచుకునే పదం.
  • సింప్‌ (Simp): ఒకరి విషయంలో లేదా ఏదైనా వస్తువు విషయంలో ఆరాధన భావం, వాంఛను ప్రదర్శించడం.
  • జెనెరేటివ్‌ ఏఐ (Generative AI): అడిగిన ప్రశ్నకు అనుగుణంగా కొత్త కంటెంట్‌ను రూపొందించే సామర్థ్యం కలిగిన కృత్రిమ మేధ.
  • ఫిన్‌స్టా (Finsta): నకిలీ లేదా రహస్య ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా.
  • షెఫ్స్‌ కిస్‌ (Chef’s Kiss): ఎదైనా ఆహారం రుచికరంగా ఉన్నప్పుడు సంతృప్తిపూర్వకంగా చేతితో చేసే సంజ్ఞ.
  • గర్ల్‌బాస్ (Girlboss): వ్యాపార రంగంలో విజయవంతమైన మహిళ.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు