Ahsan Iqbal: ‘చాయ్‌ తక్కువ తాగండి..’ వైరల్‌గా మారిన పాక్‌ మంత్రి పిలుపు!

పాకిస్థాన్‌(Pakistan) ఆర్థిక వ్యవస్థ క్రమంగా సంక్షోభం దిశగా వెళ్తోన్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం పెరగడంతో.. ఇంధనం, నిత్యావసరాల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యలతో నానా తంటాలు పడుతున్న పౌరులకు...

Published : 15 Jun 2022 00:32 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌(Pakistan) ఆర్థిక వ్యవస్థ క్రమంగా సంక్షోభం దిశగా వెళ్తోన్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం పెరగడంతో.. ఇంధనం, నిత్యావసరాల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యలతో నానా తంటాలు పడుతున్న పౌరులకు.. స్థానిక మంత్రి ఒకరు తాజాగా ఓ సలహా ఇచ్చారు. చాయ్‌ తాగడం తగ్గించాలని పిలుపునిచ్చారు. టీ పొడి సైతం అప్పు చేసి దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ మేరకు సహకరించాలని కోరారు. ఆయనే.. పాకిస్థాన్‌ ప్రణాళిక, అభివృద్ధి, ప్రత్యేక ప్రోత్సాహకాలశాఖ మంత్రి ఎహ్‌సాన్‌ ఇక్బాల్‌(Ahsan Iqbal). ఈ క్రమంలోనే మంత్రి వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన్ను, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నెటిజన్లు తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. ఆర్థిక సమస్యల కట్టడి క్రమంలో ప్రభుత్వ నిరాశ, చికాకుల వైఖరిని ఈ వ్యాఖ్యలు ప్రదర్శిస్తున్నాయన్నారు.

‘ఆర్థిక సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇదొక తెలివైన సూచనే. అయితే, ప్రధాని నివాసంలోని ఈత కొలను పునరుద్ధరణకు, విలాసవంత విందులకు, నాలుగైదు క్యాంపు కార్యాలయాల నిర్వహణకు రూ.లక్షల్లో ప్రజాధనాన్ని వినియోగించేవారు ఇలా చెప్పడం హాస్యాస్పదం. పైగా ఈ మంత్రి.. విదేశీ సూట్, టై, సన్ గ్లాసెస్ ధరించి ఉన్నారు’ అని ఓ వ్యక్తి ట్వీట్‌ చేశారు. పనికిరాని మాటలు కట్టిపెట్టి.. పకడ్బందీ ఆర్థిక వ్యూహాలను ప్రవేశపెట్టండని మరొకరు స్పందించారు. ‘స్థానికంగా తేయాకు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించండి. చాయ్‌ తాగడం తగ్గించాలని కోరడం మూర్ఖత్వం’ అని ఓ నెటిజన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని