Miss Universe 2022: విశ్వ సుందరి కిరీటం అమెరికా భామ సొంతం

71వ మిస్‌ యూనివర్స్‌ (Miss Universe) టైటిల్‌ను అమెరికాకు చెందిన భామ కైవసం చేసుకున్నారు. దీంతో ఆమెకు పలువురు ఫ్యాషన్‌ ప్రియులు అభినందనలు తెలుపుతున్నారు. 

Published : 15 Jan 2023 11:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న ‘మిస్‌ యూనివర్స్‌’ (Miss Universe) కిరీటం ఈ ఏడాది అగ్రరాజ్య వశమైంది. అమెరికాకు చెందిన ఆర్‌ బానీ గాబ్రియేల్‌ (RBonney Gabriel) ‘మిస్‌ యూనివర్స్‌ -2022’ టైటిల్‌ దక్కించుకున్నారు. మాజీ విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు.. ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ఈ పోటీల్లో మిస్‌ వెనిజులా అమందా దుదామెల్ మొదటి రన్నరప్‌గా నిలవగా.. మిస్ డొమినికన్ రిపబ్లిక్ ఆండ్రీనా మార్టినెజ్ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు. ఇక విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు.  అమెరికా లూసియానాలోని న్యూ ఓర్లీన్స్‌ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 80కిపైగా దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న దివితా రాయ్‌.. విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. టాప్‌ 5లోకి కూడా ఆమె అడుగు పెట్టలేకపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని