Fighter Jet: అమెరికాలో కనిపించకుండా పోయిన ఫైటర్ జెట్ శకలాలు లభ్యం
అమెరికాలో(America) కనిపించకుండా పోయిన వందల కోట్ల విలువైన ఫైటర్ జెట్ (Fighter Jet) శకలాలను అధికారులు గుర్తించారు. వందల కోట్ల విలువైన ఈ విమానం ఆదివారం జాడ తప్పింది. దీంతో విమానం జాడ చెప్పాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
వాషింగ్టన్: అమెరికాలో(America) కనిపించకుండా పోయిన వందల కోట్ల విలువైన ఫైటర్ జెట్ (Fighter Jet) శకలాలు లభ్యమయ్యాయి. సౌత్ కరోలినాలోని విలియమ్స్‌బర్గ్ కౌంటీలో విమానం శకలాలను గుర్తించినట్లు యూఎస్ మిలటరీ(US Military) ప్రకటించింది. ఈ శిథిలాలను సేకరించడానికి స్థానికులను అక్కడి రాకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఆదివారం సౌత్ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఫైటర్ జెట్ ఎఫ్-35B(F-35B Fighter Jet) జాడ లేకుండా పోయిన విషయం తెలిసిందే.
దక్షిణ కరోలినాలో ఫైటర్ జెట్ మిస్ కావడంతో జాడ తెలిస్తే చెప్పాలంటూ అధికారులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక పలు ఫ్లైట్ ట్రాకింగ్ సైట్‌లు విలియమ్స్‌బర్గ్ కౌంటీలోని స్టకీకి సమీపంలో ఉన్న అడవుల్లో సంచరించినట్లు సూచించాయి. మరోవైపు ఈ విమానం కూలడానికంటే ముందే పైలట్ పారాషూట్ సహాయంతో దాన్నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఎఫ్-35 లైట్‌నింగ్ II జెట్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. దీనిలో అధునాతన ఫీచర్లు, రాడార్ గుర్తించకుండా ఉండే వ్యవస్థలు ఉన్నాయి. ఇక ఫైటర్ జెట్‌ను మిస్ కావడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేశారు. విమానం జాడ కనిపెట్టిన వారికి రివార్డు అందివ్వనున్నట్లు సదరు విమానం ఫొటోలను మార్పు చేసి పోస్టు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎఫ్-35 ముందు నిల్చుని దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మరొక యూజరు ఫొటో మార్పు చేసి పోస్టు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Art of living: వాషింగ్టన్ డీసీలో మార్మోగిన శాంతి మంత్రం
-
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
-
Eluru: యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ మృతి
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
Art of living: గురుదేవ్ లేకుంటే మా దేశంలో శాంతి అసాధ్యం: కొలంబియా ఎంపీ