Russia: మోదీ పర్యటన గేమ్‌ ఛేంజర్‌: రష్యా

భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన, పుతిన్‌తో జరిగిన చర్చలు చరిత్రాత్మకమని రష్యా పేర్కొంది.

Published : 11 Jul 2024 04:19 IST

దిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన, పుతిన్‌తో జరిగిన చర్చలు చరిత్రాత్మకమని రష్యా పేర్కొంది. ఈ పర్యటనను గేమ్‌ ఛేంజర్‌గా అభివర్ణించింది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రష్యా సైన్యంలో సహాయకులుగా ఉన్న భారతీయులను వెనక్కి రప్పించడంతోపాటు పలు కీలకాంశాలపై పుతిన్, మోదీ ప్రధానంగా దృష్టి సారించినట్లు భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఘర్షణ పరిస్థితులున్న నేపథ్యంలో మాస్కోలో పర్యటించి, పుతిన్‌తో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరపడం గొప్ప విషయమని భారత్‌లోని రష్యా దౌత్యవేత్త రోమన్‌ బబుష్కిన్‌ బుధవారం దిల్లీలో పేర్కొన్నారు. మోదీ పర్యటనను యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనించిందన్న ఆయన.. ఇరుదేశాల మధ్య వాణిజ్య విస్తరణ, స్థానిక కరెన్సీలో చెల్లింపులపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చలు జరిపారని తెలిపారు. 

సైన్యంలో భారతీయులు ఉండాలని కోరుకోలేదు

రష్యా సైన్యంలో సహాయకులుగా భారతీయులు ఉండాలని తామెప్పుడూ కోరుకోలేదని బబుష్కిన్‌ తెలిపారు. వారి నియామకం వాణిజ్య కోణంలోనే జరిగిందని పేర్కొన్నారు. భారత్‌ అభిప్రాయానికి అనుగుణంగానే తమ ఆలోచనలు ఉన్నాయని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని