Published : 08 Jul 2022 02:21 IST

Monkeypox: 59 దేశాలకు పాకిన మంకీపాక్స్‌.. కేసులెన్నంటే?

ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోన్న మంకీపాక్స్‌ (Monkeypox) కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 59 దేశాలకు పాకిన వైరస్‌.. 6వేల మందిలో నిర్ధారణ అయ్యింది. గడిచిన వారంలోనే మంకీపాక్స్‌ కేసుల్లో 66శాతం పెరుగుదల కనిపించిందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అంతేకాకుండా ఈ వ్యాధి కారణంగా తాజాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య మూడుకు చేరింది.

‘మంకీపాక్స్‌ కేసులు ఎక్కువగా యూరప్‌, ఆఫ్రికాలోనే నమోదవుతున్నాయి. ముఖ్యంగా స్వలింగ సంపర్కుల్లోనే ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇతరుల్లో మాత్రం వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు ఎటువంటి దాఖలాలు లేవు. సోమవారం నాటికి 59 దేశాల్లో 6,027 కేసులు నమోదయ్యాయి. గడిచిన ఒక్క వారంలోనే 2,614 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఈ వ్యాధితో ముగ్గురు మరణించగా వారందరూ ఆఫ్రికాకు చెందినవారే’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

వైరస్‌ విస్తృత వేగంతో వ్యాప్తి చెందడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియేసస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 80శాతం కేవలం యూరప్‌ దేశాల్లోనే బయటపడ్డాయని అన్నారు. ఈ వ్యాధి ప్రాబల్యంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నామని.. జులై మూడో వారంలో డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందంతో మరోసారి సమావేశమవుతానని టెడ్రోస్‌ పేర్కొన్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని