Omicron: వేగంగా వ్యాపించే సామర్థ్యంతో ఒమిక్రాన్‌లో ఉపవేరియంట్లు

భారత్‌లో మూడో దశ కరోనా ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్‌ వేరియంట్‌లో మరో రెండు ఉపవేరియంట్లను గుర్తించినట్లు రష్యన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు....

Published : 13 Jun 2022 01:54 IST

మాస్కో: భారత్‌లో మూడో దశ కరోనా ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్‌ వేరియంట్‌లో మరో రెండు ఉపవేరియంట్లను గుర్తించినట్లు రష్యన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. మూలరూపంతో పోలిస్తే వీటికి వ్యాప్తి చెందే సామర్థ్యం తీవ్రంగా ఉన్నట్లు తెలిపారు. బీఏ.4, బీఏ.5గా వీటిని వ్యవహరిస్తున్నారు. మే నెలలో సేకరించిన నమూనాల్లో వీటిని గుర్తించినట్లు ‘రోస్పోట్రెబ్‌నడ్జోర్‌ సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎపిడెమాలజీ’ అధిపతి కమిల్‌ ఖఫిజోవ్‌ వెల్లడించారు. అయితే, ప్రస్తుతానికి రష్యాలో బీఏ.2 ఒమిక్రాన్‌ వేరియంటే తీవ్రంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఇంకా వ్యాక్సిన్లు అందని దేశాల్లో ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లు మరోసారి కరోనా ఉద్ధృతికి కారణమయ్యే ప్రమాదం ఉందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని