Vaccine: వారికి బూస్టర్‌ డోస్‌ అవసరంపై ఆధారాల్లేవు: సౌమ్య స్వామినాథన్‌

ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా బూస్టర్‌ డోసు అవసరమని ఏ పరిశోధనలోనూ తేలలేదని, దానికి ప్రమాణికమైన ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథ్‌ వెల్లడించారు. కరోనా కొత్త వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాసహా అనేక దేశాలు పిల్లలు

Published : 20 Jan 2022 02:07 IST

వాషింగ్టన్‌: ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా బూస్టర్‌ డోసు అవసరమని ఏ పరిశోధనలోనూ తేలలేదని, దానికి ప్రామాణికమైన ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ వెల్లడించారు. ప్రస్తుతం అనేక దేశాలు చేపట్టిన బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. 

‘‘కొవిడ్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు, తీవ్ర వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వైద్య సిబ్బందిని కాపాడటమే లక్ష్యంగా బూస్టర్‌ డోసును ఉపయోగించాలి. అంతే కానీ, అందరికీ ఇవ్వకూడదు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, పెద్దలకు బూస్టర్‌ డోసు అవసరమని తెలిపే ఆధారాలేవి లభించలేదు’’అని సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తీసుకున్న రెండు కొవిడ్‌ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేయలేకపోవచ్చని, రోగనిరోధక శక్తిని మరింత పెంచుకునేందుకు బూస్టర్‌ డోసు అవసరమని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయడుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక దేశాలు బూస్టర్‌ డోస్‌ డ్రైవ్‌ను చేపట్టాయి. అమెరికాలో ఇటీవల ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ కొవిడ్‌ టీకాలను బూస్టర్‌డోసుగా ఇచ్చేందుకు అక్కడి ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) అనుమతించింది. దీంతో అమెరికా ప్రభుత్వం పెద్దలతోపాటు 12 -15ఏళ్ల మధ్య ఉన్న యువతకూ ఈ బూస్టర్‌ డోసును ఇస్తోంది. కాగా.. బూస్టర్‌ డోసు ఇచ్చే విధానం ఇది కాదని సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. ఎవరికి ఈ బూస్టర్‌ డోస్‌ అవసరమవుతుందో తెలుసుకునేందుకు ఇంకా విసృతమైన పరిశోధన చేయాల్సి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని