Ukraine Crisis: లొజొవపై రష్యా భారీ దాడి..!
ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతంలోని లొజొవ నగరంపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఇక్కడ శుక్రువారం జరిగిన భీకర దాడిలో దాదాపు 1000 అపార్ట్మెంట్లు, 11 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయి.
ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతంలోని లొజొవ నగరంపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఇక్కడ శుక్రువారం జరిగిన భీకర దాడిలో దాదాపు 1000 అపార్ట్మెంట్లు, 11 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని ఆ నగర మేయర్ షెర్హీవ్ జెలెన్స్కీ వెల్లడించారు. కూలిన వాటిలో 5 పాఠశాలలు, ఒక ఆసుపత్రి కూడా ఉన్నట్లు వెల్లడించారు. ప్రతిష్ఠాత్మకమైన ఖర్కీవ్ ఆటోమొబైల్ అండ్ రోడ్ కాలేజ్ భవనం కూడా ఉంది. ఇక లజొవలోని హౌస్ ఆఫ్ కల్చర్ కూడా క్షిపణిదాడిలో ధ్వంసమైంది.
ఉక్రెయిన్ ఆధీనంలోని ఒలిగార్క్ విడుదలకు రష్యా యత్నాలు..
ఉక్రెయిన్‌లో ఉన్న ఒలిగార్క్ విక్టర్ మెద్వెద్‌చుక్‌ను రష్యాకు రప్పించేందుకు యత్నాలు జరుగుతన్నాయి. ఇప్పటికే మేరియుపోల్‌లో ఆధీనంలోకి తీసుకొన్న అజోర్ రెజ్మెంట్ ఫైటర్లను ఈ డీల్ కోసం రష్యా ఉపయోగించుకొనే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. రష్యా ప్రతినిధుల బృందం సభ్యుడు లియోనిడ్ స్పందిస్తూ..‘‘ ఈ విషయాన్ని పరిశీలిస్తాము’’ అని పేర్కొన్నాడు. విక్టర్ మెద్వెద్‌చుక్‌ను ఉక్రెయిన్ దళాలు ఏప్రిల్‌లో నిర్వహించిన ఓ స్పెషల్ ఆపరేషన్‌లో అరెస్టు చేశాయి. ఈ విషయాన్ని అప్పట్లో అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా వెల్లడించారు. రష్యా ఆక్రమణకు ముందు నుంచే విక్టర్‌పై రాజద్రోహం ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్‌లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్‌లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.