
North Korea: రోజుల వ్యవధిలోనే 10 లక్షల మందికి జర్వం.. అవి కోవిడ్ కేసులేనా?
ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తరకొరియాలో కరోనా విజృంభిస్తోందా?తొలికేసు బయటపడిన రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో ప్రజలు జ్వరాలు బారిన పడటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. భారీగా టెస్టులు చేసే అవకాశం ఉత్తరకొరియాకు లేకపోవడంతో.. లక్షణాల ఆధారంగానే కొవిడ్‌గా భావిస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ మీడియానే వెల్లడించింది. దాదాపు 10 లక్షల మందికి పైగా జ్వరంతో బాధపడుతున్నారని మీడియా పేర్కొంది. ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరకొరియాలో కొవిడ్ పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. అక్కడ సరైన ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం, వ్యాక్సినేషన్లు వేయకపోవడంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో జాతీయ స్థాయిలో లాక్డౌన్ విధించారు. ఇటీవల ఉ.కొరియా అధినేత కిమ్ ఎమర్జెన్సీ పొలిట్ బ్యూరో మీటింగ్ నిర్వహించారు. దీనిలో ఔషధ సరఫరాలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. దీంతో ఉ.కొరియా సైన్యంలో మెడికల్ కోర్‌ను రంగంలోకి దింపారు. ప్యాంగ్యాంగ్ నగరానికి ఔషధ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఉత్తర కొరియా కోరితే.. ఎంత సాయమైనా పంపేందుకు సిద్ధమే అని ఇటీవల దక్షిణ కొరియా ప్రకటించింది.
గత వారమే ఉ.కొరియాలో తొలి కొవిడ్ కేసు నిర్ధారించారు. అప్పటికే వైరస్ వ్యాప్తి జరిగిపోయి ఉంటుందని వైద్యులు అంచనావేశారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధినేత కిమ్ వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఎమర్జెన్సీ విధించారు. గతేడాది పలు దేశాలు ఉత్తరకొరియాకు ఆస్ట్రాజెనెకా, చైనా తయారీ టీకాలను ఆఫర్ చేశాయి. కానీ, ఉ.కొరియా మాత్రం లాక్ డౌన్, సరిహద్దుల మూసివేతతోనే వైరస్‌ను అదుపు చేస్తామని పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra: ‘మహా’ సంక్షోభం.. ఠాక్రే సర్కారుకు రేపే బలపరీక్ష
-
India News
India Corona: లక్షకు చేరువగా క్రియాశీల కేసులు..!
-
Business News
Stock Market Update: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
-
Movies News
DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
CRDA: రాజధాని రైతులకు రూ.184 కోట్ల కౌలు చెల్లింపు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- డీఏ బకాయిలు హుష్‌కాకి!