Giraffe vs Lioness: ‘అమ్మ ప్రేమ’ ముందు.. తలవంచిన సింహం
తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఓ తల్లి జిరాఫీ (Giraffe) ..సింహం (Lioness) బారి నుంచి తన బిడ్డను రక్షించుకుంది. జిరాఫీ తెగువను పలువురు అభినందిస్తున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: అమ్మప్రేమ వెల కట్టలేనిది. ఎన్ని కష్టాల్లో ఉన్నా.. మన దగ్గర అమ్మ ఉంటే ఎంతో ధైర్యం. బిడ్డ బాగోగులను, అభ్యున్నతిని కోరుకునే వారిలో అమ్మ తరువాతే ఎవరైనా. ఆపద కాలంలో తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టయినా సరే.. తల్లి తన పిల్లల్ని కాపాడుకోవాలని చూస్తుంది. ఇది కేవలం మనుషులకే కాదు.. జంతువులకూ వర్తిస్తుందని నిరూపించిందో జిరాఫీ. సింహంతో పోరాడి మరీ తన బిడ్డను కాపాడుకుంది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. మైదాన ప్రాంతంలో ఓ జిరాఫీ పిల్ల కూర్చొని ఉంది. అది గమనించిన ఓ ఆడ సింహం నక్కి నక్కి ఒక్క ఉదుటున దూకి దాని మెడ పట్టుకుంటుంది.
తప్పించుకోవడానికి ఆ జిరాఫీ పిల్ల ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. అక్కడికి దగ్గర్లోనే ఉన్న జిరాఫీ తల్లి.. ఆపదలో ఉన్న తన పిల్లను చూసి పరుగెత్తుకుంటూ సింహంపై దాడి చేసింది. సింహం తనకంటే బలవంతమైందని తెలిసి కూడా.. తన బిడ్డను కాపాడేందుకు సాహసించింది. తల్లి జిరాఫీ రాకను గమనించిన సింహం అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే మళ్లీ వెనక్కి వచ్చిన జిరాఫీ తన పిల్లకు భరోసాగా అక్కడే నిలబడింది. ఈ వీడియోను యానిమల్ వరల్డ్స్ 11 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ప్రాణాలకు తెగించి తల్లి జిరాఫీ చేసిన పోరాట తెగువను నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు
-
Ap-top-news News
Justice Battu Devanand : జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ
-
Politics News
Ganta Srinivasa Rao: ఫైనల్స్లో వైకాపా ఉండదు
-
Politics News
Kola Guruvulu: కోలా గురువులుకు మళ్లీ నిరాశే
-
Ap-top-news News
Botsa Satyanarayana: నాకు 2 మార్కులే ఇస్తామన్నారుగా: మంత్రి బొత్స