US: వాల్‌మార్ట్‌ స్టోర్‌లో మేనేజర్‌ కాల్పులు.. పలువురి మృతి

అమెరికాలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మృతిచెందారు.

Updated : 23 Nov 2022 16:35 IST

వర్జీనియా: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. వర్జీనియాలోని ప్రముఖ వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. నిందితుడు అదే స్టోర్‌లో పనిచేస్తోన్న మేనేజర్‌గా తెలుస్తోంది.

అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి స్టోర్‌ మేనేజర్‌ బ్రేక్‌ రూంలోకి చొరబడి అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 35-40 నిమిషాల పాటు జరిపిన ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలో ఇటీవల కాలంలో జరిగిన భీకర కాల్పుల ఘటన ఇదేనని పోలీసులు తెలిపారు. ఘటనపై వాల్‌మార్ట్‌ సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు