N Korea: దక్షిణ కొరియాదో చెత్త ఆఫర్: కిమ్ సోదరి
అణ్వాయుధాలను వదులుకొంటే ఆర్థిక సాయం చేస్తామంటూ ఆఫర్ ప్రకటించిన దక్షిణ కొరియా పై ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. అసంబద్ధతకు నిలువెత్తు
ఇంటర్నెట్‌డెస్క్: అణ్వాయుధాలను వదులుకొంటే ఆర్థిక సాయం చేస్తామంటూ ఆఫర్ ప్రకటించిన దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. అసంబద్ధతకు నిలువెత్తు నిదర్శనం దక్షిణకొరియా ఆఫర్ అని అభివర్ణించారు. కేవలం తిండి కోసం ఎవరూ వారి లక్ష్యాలను వదలుకోరని పేర్కొన్నారు. దక్షిణకొరియా అధినేత యూన్ సుక్ యేల్ కొంచెం నోరుమూసుకోవాలని హెచ్చరించారు. ఆయనవి అమాయక చర్యలని.. వాటిని పిల్లచేష్టలతో పోల్చారు.
కిమ్ యో జోంగ్ కఠిన వ్యాఖ్యలపై దక్షిణికొరియా అధ్యక్ష కార్యాలయం స్పందించింది. కిమ్ సోదరి కామెంట్లు విచారకరమని పేర్కొంది. అయినా కానీ.. తమ ఆఫర్ ఇప్పటికీ అందుబాటులో ఉందని తెలిపింది. దక్షిణ కొరియా శాంతి కోసం సాహసోపేతమైన ఆఫర్‌ను సిద్ధం చేస్తోందని అధ్యక్షుడు యూన్ మే నెలలో ప్రకటించారు. అది ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు.. జీవన ప్రమాణాలను పెంచుతుందని పేర్కొన్నారు. బుధవారంతో యూన్ బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తికావడంతో మాట్లాడుతూ.. దశల వారీగా ఉత్తరకొరియాకు ఆర్థిక సాయం చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా కిమ్ సోదరి స్పందిస్తూ.. తమకు ఆ ప్లాన్ ఏమిటో తెలియదని.. అసలు అటువంటి వాటితో డీల్ ఎప్పుడూ చేయమని తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు