Astronauts: ‘బోయింగ్‌’లోనే తిరిగొస్తాం.. వ్యోమగాముల ధీమా

బోయింగ్‌ స్పేస్‌ క్యాప్సూల్‌ ‘స్టార్‌లైనర్‌’ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన వ్యోమగాములు.. తిరిగి తాము అందులోనే వెనక్కి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Published : 11 Jul 2024 05:20 IST

కేప్‌ కెనావెరల్‌: బోయింగ్‌ స్పేస్‌ క్యాప్సూల్‌ ‘స్టార్‌లైనర్‌’ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన వ్యోమగాములు.. తిరిగి తాము అందులోనే వెనక్కి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని వారాల కిందటే తిరిగి రావాల్సిన వారు స్టార్‌లైనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్‌ విల్‌మోర్‌లు అంతరిక్షం నుంచి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. థ్రస్టర్‌ పరీక్ష పూర్తయ్యాక తమ తిరుగు ప్రయాణం ఉంటుందని చెప్పారు. తాము ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండటంపై ఫిర్యాదులేమీ చేయడం లేదని, స్టేషన్‌ సిబ్బందికి సహాయం చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నామని తెలిపారు. ‘స్పేస్‌క్రాఫ్ట్‌ మమ్మల్ని ఇంటికి తీసుకొస్తుంది. ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా’ అని సునీతా విలియమ్స్‌ పేర్కొన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని