NASA: భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలపై నాసా సన్నద్ధత

భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలపై ఎలాంటి సన్నద్ధతలు తీసుకోవాలన్న అంశంపై నాసా శాస్త్రవేత్తల బృందం చర్చించింది.

Updated : 23 Jun 2024 19:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూమికి దగ్గరగా గ్రహశకలాలు వస్తే ఏం చేయాలన్న అంశంపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) కార్యశాల నిర్వహించింది. తాజాగా ఇందుకు సంబంధించి ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో భాగంగా 2038లో గ్రహశకలం(asteroid) భూమికి సమీపంలో వస్తే దాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలన్న అంశంపైనా చర్చించింది.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐదో ద్వైవార్షిక ప్లానెటరీ డిఫెన్స్ ఇంటర్‌ ఏజన్సీ టాబ్లెట్‌ టాప్ పరిశోధనలను ఏప్రిల్‌లో నిర్వహించింది. జూన్ 20న మేరీల్యాండ్‌(Maryland)లోని లారెల్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ (APL)లో చేసిన ఈ పరిశోధనల్లో గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందన్న దానిపై ఊహాత్మక అంశంపై అభ్యాసన చేసింది. ఈ పరిశోధనలో నాసాతో పాటుగా అమెరికా ప్రభుత్వ ఏజెన్సీలు, అంతర్జాతీయంగా నాసాకు సహకారం అందిస్తున్న పలువురు ప్రతినిధులు పాల్గొన్నారని సంస్థ పేర్కొంది. సాధారణంగా వేలాది గ్రహశకలాల భూకక్ష్యలోకి వస్తుంటాయి. అయితే, ఇవి ప్రవేశించడంతోనే విపరీతమైన ఒత్తిడి నెలకొని ముక్కలుగా అయిపోవడంతో పాటు కాలి బూడిదై వాతావరణంలో కలిసిపోతాయి. వీటి వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండదు. గత కొన్ని శతాబ్దాల్లో భూకక్ష్యను దాటుకొని భూమిని తాకినవి అతి తక్కువ మాత్రమే. వీటి వల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని