NASA: 2040 నాటికి చంద్రుడిపై 3డీ ఇళ్ల నిర్మాణం.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నాసా
చంద్రుడిపై ఇళ్ల నిర్మాణానికి నాసా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం త్వరలో 3డీ ప్రింటర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి చేర్చనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ సహా పలు దేశాలు చంద్రుడి గుట్టు విప్పేందుకు ఎంతో కాలంగా పరిశోధనలు సాగిస్తున్నాయి. చంద్రుడిపై మానవాళి జీవనానికి అనువైన వాతావరణం ఉందా? అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 2040 నాటికి చంద్రుడిపై మనుషుల కోసం నాసా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ‘న్యూయార్క్‌టైమ్స్’ ఓ కథనంలో పేర్కొంది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల కోసం వ్యోమగాములు అధిక సమయం అక్కడే ఉండేందుకు ఈ నిర్మాణాలు తోడ్పడతాయని నాసా భావిస్తోంది. 3డీ ప్రింటర్ సాయంతో రాక్ చిప్స్, ఖనిజాలను ఉపయోగించి ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.
‘‘కొన్నిసార్లు ఇది కలలా అనిపించవచ్చు. కానీ, ప్రైవేటు కంపెనీలు, యూనివర్సిటీలను భాగస్వాములను చేస్తూ ఆధునిక సాంకేతికత సాయంతో ఈ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నాం. 2024 ఫిబ్రవరిలో 3డీ ప్రింటర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి పంపాలని నిర్ణయించాం. ప్రస్తుతం ప్రింటర్ పనితీరును పరీక్షిస్తున్నాం’’ అని నాసా సాంకేతిక విభాగం డైరెక్టర్ నిక్కీ వెర్కీసర్ తెలిపారు.
నిజ్జర్ హత్యపై ఆరోపణలు.. కెనడాతో టచ్‌లోనే ఉన్నాం: అమెరికా
ఆర్టెమిస్-1 ప్రయోగం తర్వాత నాసా ఆర్టెమిస్-2, ఆర్టెమిస్-3 ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 2024లో ఆర్టెమిస్-2 యాత్రను నిర్వహించనుంది. అందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. వారు చంద్రుడిపై దిగకుండా, ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి వస్తారు. ఆ యాత్ర విజయవంతమైతే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యంత ఎక్కువ దూరం అదే అవుతుంది. 2025లో ఆర్టెమిస్-3 జరుగుతుంది. ఆ యాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతారని నాసా తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం బుధవారం జపాన్ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. -
ఇక హెచ్-1బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే
అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు శుభవార్త. కొన్ని తరగతుల హెచ్-1బీ వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రానవసరం లేదు. -
పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో దూసుకెళ్లిన తొలి వాణిజ్య విమానం
సంప్రదాయ ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)తో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్ అట్లాంటిక్ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. -
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
అమెరికాలో భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ (23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
కాప్ సదస్సుకు గైర్హాజరుకానున్న బైడెన్
గురువారం నుంచి రెండు వారాలపాటు దుబాయిలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారులు మంగళవారం తెలిపారు. -
అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలి
పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడానికి వెంటనే అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కోరారు. -
ఉష్ణమండలీకరణతో సముద్రజీవుల వలస
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్రజాతులు భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు కదులుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ
క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది. -
ఎన్నికల ముందు షరీఫ్‌కు ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (73)ను ఏవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో నిర్దోషిగా ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. -
నేపాల్‌లో తొలి స్వలింగ వివాహ నమోదు
నేపాల్‌లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్‌జంగ్ జిల్లా డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్‌జెండర్ మహిళ మాయా గురుంగ్ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టరైంది. -
81కి చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల సాఫీగా సాగిపోయింది. 5 రోజుల్లో మొత్తం 81 మంది బందీలను హమాస్, 180 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. -
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం
ఉక్రెయిన్ గూఢచర్య విభాగం అధిపతి కిర్లో బుడనోవ్ భార్య మరియా బుడనోవ్‌పై విషప్రయోగం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.