Nasa: తొలిసారి ఆస్ట్రేలియా వాణిజ్య స్పేస్ పోర్టును వాడిన నాసా
ఇంటర్నెట్‌డెస్క్: నాసా చరిత్రలో తొలిసారి అమెరికా బయట ఒక వాణిజ్య స్పేస్ పోర్టు నుంచి రాకెట్ ప్రయోగం నిర్వహించింది. ఆస్ట్రేలియా చరిత్రలో తొలి వాణిజ్య అంతరిక్ష ప్రయోగం కూడా ఇదే. నులున్బై ప్రాంతంలోని ధుపుమ పీఠభూమిపై ఏర్పాటు ఏర్పాటు చేసిన అర్న్‌హెమ్ స్పేస్ సెంటర్లో ఇది జరిగింది. ఈ ప్రయోగం ద్వారా నక్షత్రాల వెలుగు గ్రహాల నివాసయోగ్యత ఏమేరకు ప్రభావం చూపిస్తుందో అధ్యయనం చేసేందుకు నిర్వహించారు.
ఈ రాకెట్ ఎక్స్‌రే క్వాంటమ్ కేలరీ మీటర్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. దీని సాయంతో మిషిగాన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నక్షత్రాల మధ్య ఎక్స్ కిరణాలను అత్యంత కచ్చితత్వంతో అధ్యయనం చేస్తారు. వీటి నుంచి సేకరించిన సమాచారం ఆధారం విశ్వం పుట్టుకను తెలుసుకొనే యత్నం చేస్తారు.
ఈ ప్రయోగం కోసం 75 మంది నాసా సిబ్బంది అర్న్‌హెమ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకొన్నారు. నాసా చివరిసారిగా 1995లో ఆస్ట్రేలియా నుంచి రాకెట్‌ను ప్రయోగించింది. ఈ ప్రయోగం అప్పట్లో దక్షిణ ఆస్ట్రేలియాలోని రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన వూమెరా రేంజి కాంప్లెక్స్ నుంచి జరిగింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Latestnews News
Whatsapp: వాట్సాప్ నుంచి కొత్త అప్డేట్.. ఇక 2 రోజుల తర్వాతా డిలీట్!
-
Movies News
Nithiin: సెట్స్‌లో నితిన్, కృతిశెట్టి నవ్వులు.. ‘మాచర్ల..’ మేకింగ్ వీడియో చూశారా!
-
Politics News
Harish Rao: తక్షణమే 50లక్షల వ్యాక్సిన్లు పంపండి: కేంద్రానికి హరీశ్ లేఖ
-
Politics News
Bihar: భాజపాతో పొత్తు ముగిసింది.. పార్టీ నేతల సమావేశంలో నీతీశ్ నిర్ణయం
-
General News
Nellore: నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Sports News
Anand Mahindra : ఈ బల్లెం వీరుల అనుబంధానికి బంగారు పతకం ఇవ్వాలి..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!